ఏల రట్టుసేసుకొనే నిదె నీవె నీ వలపు
(॥పల్లవి॥)
ఏల రట్టుసేసుకొనే నిదె నీవె నీ వలపు
వాలాయించక నేఁ దలవంచుకొనరాదా
(॥ఏల॥)
కామినిముఁ(ముం?) జేయి నీవు కైదండ వట్టుకొని
నామోము చూచినందుకు నగరాదా
ఆముక యాపెదండ నీ కటు చెమట గారఁగా
యేమీననక పరాకై యిట్టుండరాదా
(॥ఏల॥)
నేరుపుతో నాపెసొమ్ము నీమెడఁ బెట్టుకరాఁగా
నీరెంటెము నీకుఁ గప్పి నే దాఁచరాదా
చేరిచేరి యాపెకుఁగా చిత్తమెల్లాఁ గరఁగఁగా
కోరి యెఱఁగమిసేసుకొని వుండరాదా
(॥ఏల॥)
కూడికూడి యాపె నీవు కుచ్చి కాఁగటిలించుకోఁగా
వేడుకతో నేఁ దెరవేయరాదా
యీడనె శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
తోడనే నీమోవి గుఱుతులు వెట్టరాదా
(||pallavi||)
ela raṭṭusesugŏne nidĕ nīvĕ nī valabu
vālāyiṁchaga nem̐ dalavaṁchugŏnarādā
(||ela||)
kāminimum̐(muṁ?) jeyi nīvu kaidaṁḍa vaṭṭugŏni
nāmomu sūsinaṁdugu nagarādā
āmuga yābĕdaṁḍa nī kaḍu sĕmaḍa gāram̐gā
yemīnanaga parāgai yiṭṭuṁḍarādā
(||ela||)
nerubudo nābĕsŏmmu nīmĕḍam̐ bĕṭṭugarām̐gā
nīrĕṁṭĕmu nīgum̐ gappi ne dām̐sarādā
seriseri yābĕgum̐gā sittamĕllām̐ garam̐gam̐gā
kori yĕṟam̐gamisesugŏni vuṁḍarādā
(||ela||)
kūḍigūḍi yābĕ nīvu kuchchi kām̐gaḍiliṁchugom̐gā
veḍugado nem̐ dĕraveyarādā
yīḍanĕ śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
toḍane nīmovi guṟudulu vĕṭṭarādā