Ela rattusesidi vimtesi nannu

ఏల రట్టుసేసితి వింతేసి నన్ను
Language

(॥పల్లవి॥)
ఏల రట్టుసేసితి వింతేసి నన్ను
లోలోనే చెప్పేఁగాని లోనికి రారాదా

(॥॥)
సారెకు నీవు నాతో జాణతనాలాడఁగాను
చేరి చేరి నవ్వేరు చెలియలెల్లా
గారవాన నాసరుసఁ గమ్మటిఁ గూచుండఁగాను
తారుకాణలివి యని తమలో నెంచేరు

(॥॥)
చన్నులమీఁది పయ్యద జార నీవు దియ్యఁగాను
సన్నలు సేసుకొనేరు సభలోనెల్లా
పన్ని నాచేతికి పూవుబంతి యిట్టె యొసగఁగా
యిన్నిటాఁ బొందుకు గురుతిది యనేరు

(॥॥)
కప్పురపు వీడెమిచ్చి కాఁగిలించుకొనఁగాను
చొప్పులెత్తి మొగములు చూచుకొనేరు
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టే
చిప్పిలఁ గళలు రేఁగి సిగ్గులువడేరు

(||pallavi||)
ela raṭṭusesidi viṁtesi nannu
lolone sĕppem̐gāni lonigi rārādā

(||||)
sārĕgu nīvu nādo jāṇadanālāḍam̐gānu
seri seri navveru sĕliyalĕllā
gāravāna nāsarusam̐ gammaḍim̐ gūsuṁḍam̐gānu
tārugāṇalivi yani tamalo nĕṁcheru

(||||)
sannulamīm̐di payyada jāra nīvu diyyam̐gānu
sannalu sesugŏneru sabhalonĕllā
panni nāsedigi pūvubaṁti yiṭṭĕ yŏsagam̐gā
yinniḍām̐ bŏṁdugu gurudidi yaneru

(||||)
kappurabu vīḍĕmichchi kām̐giliṁchugŏnam̐gānu
sŏppulĕtti mŏgamulu sūsugŏneru
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭe
sippilam̐ gaḽalu rem̐gi sigguluvaḍeru