ఏల రట్టుసేసేవు యిదేరా నీవు
(॥పల్లవి॥)
ఏల రట్టుసేసేవు యిదేరా నీవు
కాలు దొక్కినదానితోఁ గాఁతాళించ నేఁటికి
(॥ఏల॥)
పెలుచుమాటల నొట్టు వెట్టుకొన్న దానితోడ
చలములు సాదించ సంగతిగాదు
చలివాసి సారె సారె జంకించె దానితోడ
బలిమితోఁ బెనఁగఁగఁ బనిలేదు
(॥ఏల॥)
బాసలు దప్పితివంటా పంతమాడే దానితోడ
రాసికెక్కఁ జేఁత సేయ నానగాదు
ఆసల నెదురు చూచి అలసినదానితోను
గాసిఁ బెట్టి నవ్వ నెక్కడా నీతిగాదు
(॥ఏల॥)
చెమటలు మేననిండాఁ జిమ్మిరేఁగిని దానితో
తమకించి కాఁకరేఁచఁ దగవుగాదు
సమరతిఁ గూడితి విచ్చట శ్రీవేంకటేశ్వర
సముకపుదాన నాతో జాగుసేయరాదు
(||pallavi||)
ela raṭṭusesevu yiderā nīvu
kālu dŏkkinadānidom̐ gām̐tāḽiṁcha nem̐ṭigi
(||ela||)
pĕlusumāḍala nŏṭṭu vĕṭṭugŏnna dānidoḍa
salamulu sādiṁcha saṁgadigādu
salivāsi sārĕ sārĕ jaṁkiṁchĕ dānidoḍa
balimidom̐ bĕnam̐gam̐gam̐ baniledu
(||ela||)
bāsalu dappidivaṁṭā paṁtamāḍe dānidoḍa
rāsigĕkkam̐ jem̐ta seya nānagādu
āsala nĕduru sūsi alasinadānidonu
gāsim̐ bĕṭṭi navva nĕkkaḍā nīdigādu
(||ela||)
sĕmaḍalu menaniṁḍām̐ jimmirem̐gini dānido
tamagiṁchi kām̐karem̐sam̐ dagavugādu
samaradim̐ gūḍidi vichchaḍa śhrīveṁkaḍeśhvara
samugabudāna nādo jāguseyarādu