Ela rattusesevoyi yidigo aabe

ఏల రట్టుసేసేవోయి యిదిగో ఆపె
Language

(॥పల్లవి॥)
ఏల రట్టుసేసేవోయి యిదిగో ఆపె
తాలిమి సిగ్గరిదాన దండనున్న దాపె

(॥ఏల॥)
కోలుముందై మన మాడుకోనేటిమాటలెల్లాను
ఆలకించి వినవచ్చె నదివో ఆపె
వోలి సదమదములై వున్న మనపొందులెల్లా
వొలిమితోఁ జూడవచ్చె పొరుగున నాపె

(॥ఏల॥)
యీరీతి నేకతమున ఇద్దరము నుండఁగాను
కేరడాన నవ్వవచ్చెఁ గెరలి యాపె
సారె నొకరొకరము చనవులు మెరయఁగా
మేరమీరఁ దానువచ్చె మిక్కిలి నాపె

(॥ఏల॥)
యిత్తల నీవును నేను యెనయుచు నుండఁగాను
పొత్తులుగలయ వచ్చె పొదిగి యాపె
బత్తితో శ్రీవేంకటేశ పైకొన్న మేనవారము
కొతవావి చెప్ప వచ్చెఁ గొసరి యాపె

(||pallavi||)
ela raṭṭusesevoyi yidigo ābĕ
tālimi siggaridāna daṁḍanunna dābĕ

(||ela||)
kolumuṁdai mana māḍugoneḍimāḍalĕllānu
ālagiṁchi vinavachchĕ nadivo ābĕ
voli sadamadamulai vunna manabŏṁdulĕllā
vŏlimidom̐ jūḍavachchĕ pŏruguna nābĕ

(||ela||)
yīrīdi negadamuna iddaramu nuṁḍam̐gānu
keraḍāna navvavachchĕm̐ gĕrali yābĕ
sārĕ nŏgarŏgaramu sanavulu mĕrayam̐gā
meramīram̐ dānuvachchĕ mikkili nābĕ

(||ela||)
yittala nīvunu nenu yĕnayusu nuṁḍam̐gānu
pŏttulugalaya vachchĕ pŏdigi yābĕ
battido śhrīveṁkaḍeśha paigŏnna menavāramu
kŏdavāvi sĕppa vachchĕm̐ gŏsari yābĕ