ఏల రట్టు చేసుకొనే విప్పుడు నీకు నీవే
(॥పల్లవి॥)
ఏల రట్టు చేసుకొనే విప్పుడు నీకు నీవే
కోలుముందుగా నాపె గుంపించెనా నిన్నును
(॥ఏల॥)
కలికితనాన నిన్ను కన్నుల జంకించెఁ గాక
యెలమిఁ గోపగించేనా యింతి నీపైని
వలపు చూపవలసి వడిగా మాటాడెఁ గాక
అలరి నిన్నే మైనా నదలించెనా
(॥ఏల॥)
నంటున నీపై బత్తిని నాటఁజూచెఁగాక యింతి
జంటల నీమీఁదఁ బగ సాదించెనా
యింటిలోన నీగుణాలు యెరిఁగి తానవ్వెఁగాక
వెంటనే వెంగేలు నీపై వెదచల్లెనా
(॥ఏల॥)
కడుఁ దమకించి నిన్నుగాఁగిలించుకొనెఁ గాక
తొడిఁబడ నిచ్చట నీతోఁ బెనఁగెనా
కడఁగి శ్రీవేంకటేశ కాంత నిట్టె యేలితివి
అడియాలాలకుఁగాక అంటించెనా గురుతు
(||pallavi||)
ela raṭṭu sesugŏne vippuḍu nīgu nīve
kolumuṁdugā nābĕ guṁpiṁchĕnā ninnunu
(||ela||)
kaligidanāna ninnu kannula jaṁkiṁchĕm̐ gāga
yĕlamim̐ gobagiṁchenā yiṁti nībaini
valabu sūbavalasi vaḍigā māḍāḍĕm̐ gāga
alari ninne mainā nadaliṁchĕnā
(||ela||)
naṁṭuna nībai battini nāḍam̐jūsĕm̐gāga yiṁti
jaṁṭala nīmīm̐dam̐ baga sādiṁchĕnā
yiṁṭilona nīguṇālu yĕrim̐gi tānavvĕm̐gāga
vĕṁṭane vĕṁgelu nībai vĕdasallĕnā
(||ela||)
kaḍum̐ damagiṁchi ninnugām̐giliṁchugŏnĕm̐ gāga
tŏḍim̐baḍa nichchaḍa nīdom̐ bĕnam̐gĕnā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kāṁta niṭṭĕ yelidivi
aḍiyālālagum̐gāga aṁṭiṁchĕnā gurudu