Ela purumdu vettevu yeebedo nannu

ఏల పురుఁడు వెట్టేవు యీపెతో నన్ను
Language

(॥పల్లవి॥)
ఏల పురుఁడు వెట్టేవు యీపెతో నన్ను
నీ లాగు లిటువంటివే నిన్నిఁక నేమందును

(॥ఏల॥)
వేఁకపునీ(నా?) గుబ్బలతో వెలయ నీమనసారా
తూఁకువ కాపె చన్నులు తూఁచి చూడుమా
సోఁక నిద్దరికన్నులు సొరిది నీచేరలను
తేఁకువఁ గొలచి చూచి తెలుసుకొమ్మా

(॥ఏల॥)
బారెఁడేసినా నెరులపాటి వాపెనెరులును
యేరీతి నుండీనో ఇప్పుడీడువెట్టుమా
గారాపునాపాదాలసంగతి నాపెకాళ్లును
కేరడాలు మాని నీవు గెర వా(వ్రా?) సుకొనుమా

(॥ఏల॥)
పిక్కటిల్లునాపిరుఁదు ప్రేమ నాపెజఘనము
లెక్కసేసి నీవు కాఁగిలించి మెచ్చుమా
ఇక్కువ శ్రీవేంకటేశ యేలితి విద్దరి మమ్ము
పక్కనిడుకొని మమ్ముఁ బాయ కిట్టె వుండుమా

(||pallavi||)
ela purum̐ḍu vĕṭṭevu yībĕdo nannu
nī lāgu liḍuvaṁṭive ninnim̐ka nemaṁdunu

(||ela||)
vem̐kabunī(nā?) gubbalado vĕlaya nīmanasārā
tūm̐kuva kābĕ sannulu tūm̐si sūḍumā
som̐ka niddarigannulu sŏridi nīseralanu
tem̐kuvam̐ gŏlasi sūsi tĕlusugŏmmā

(||ela||)
bārĕm̐ḍesinā nĕrulabāḍi vābĕnĕrulunu
yerīdi nuṁḍīno ippuḍīḍuvĕṭṭumā
gārābunābādālasaṁgadi nābĕgāḽlunu
keraḍālu māni nīvu gĕra vā(vrā?) sugŏnumā

(||ela||)
pikkaḍillunābirum̐du prema nābĕjaghanamu
lĕkkasesi nīvu kām̐giliṁchi mĕchchumā
ikkuva śhrīveṁkaḍeśha yelidi viddari mammu
pakkaniḍugŏni mammum̐ bāya kiṭṭĕ vuṁḍumā