Ela poralevuleve yimtaloni panigi

ఏల పొరలేవులేవే యింతలోని పనికి
Language

(॥పల్లవి॥)
ఏల పొరలేవులేవే యింతలోని పనికి
మాలయింటి తోలుకప్పుమాయ లిటువంటివి

(॥ఏల॥)
చిక్కులతమకముల చీఁకటిగప్పిననాఁడు
యెక్కువ వాసనలౌ హేయపుమేను
వెక్కసపు ప్రియమది విరిగితే రోఁతలౌ
లక్కపూఁతకపురు లీలాగు లిటువంటివి

(॥ఏల॥)
మించినచిత్తములో మేలుగలిగిననాఁడు
యెంచరానిచవులౌ నెంగలిమోవి
పెంచుకంటే కష్టమౌ ప్రియముదీరిననాఁడు
చంచలపు చిత్తములచంద మిటువంటిది

(॥ఏల॥)
వెల్లి గొనుసురతపువేళ మరపులయింపు
కొల్లలాడుటౌ కొనగోరితాఁకులు
నల్లితిండౌ మరి మీఁద మరగితే రోఁతలౌ
వుల్లమిచ్చే వేంకటేశువొద్ది కిటువంటిది

(||pallavi||)
ela pŏralevuleve yiṁtaloni panigi
mālayiṁṭi tolugappumāya liḍuvaṁṭivi

(||ela||)
sikkuladamagamula sīm̐kaḍigappinanām̐ḍu
yĕkkuva vāsanalau heyabumenu
vĕkkasabu priyamadi virigide rom̐talau
lakkabūm̐tagaburu līlāgu liḍuvaṁṭivi

(||ela||)
miṁchinasittamulo melugaliginanām̐ḍu
yĕṁcharānisavulau nĕṁgalimovi
pĕṁchugaṁṭe kaṣhṭamau priyamudīrinanām̐ḍu
saṁchalabu sittamulasaṁda miḍuvaṁṭidi

(||ela||)
vĕlli gŏnusuradabuveḽa marabulayiṁpu
kŏllalāḍuḍau kŏnagoridām̐kulu
nallidiṁḍau mari mīm̐da maragide rom̐talau
vullamichche veṁkaḍeśhuvŏddi kiḍuvaṁṭidi