ఏల పూసుకవచ్చేవు యింతేసి నీవు
(॥పల్లవి॥)
ఏల పూసుకవచ్చేవు యింతేసి నీవు
వేలికొనఁ బెనఁగఁగా విదిలించరాదా
(॥ఏల॥)
కూరిమిగలదానవు కొంగువట్టె నాతఁడు
నేరమి నన్నేలెంచేవే నీవు సారెకు
భారపుగుబ్బలమీఁదిపయ్యద దీసి నన్ను
గోకరు దియ్యఁగా నాతనిఁ గోరి తిట్టరాదా
(॥ఏల॥)
పట్టపుదేవులవు నీపతి నాతో మాఁటాడితే
ఱట్టుచేసే వీడ నన్నూఱకే నీవు
మెట్టిపట్టు కాతఁడు మేనవాని పయిమోవ
చుట్టి కాఁగిలించఁగాను సూడువట్టరాదా
(॥ఏల॥)
యిచ్చకురాలవు నాకు నితఁడు విడె మియ్యఁగా
కొచ్చికొచ్చి వెంగెములే కుప్పవెట్టేవు
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిటు నన్నుఁ గూడఁగాను
పచ్చిరతులఁ జొక్కించి పంతమాడరాదా
(||pallavi||)
ela pūsugavachchevu yiṁtesi nīvu
veligŏnam̐ bĕnam̐gam̐gā vidiliṁcharādā
(||ela||)
kūrimigaladānavu kŏṁguvaṭṭĕ nādam̐ḍu
nerami nannelĕṁcheve nīvu sārĕgu
bhārabugubbalamīm̐dibayyada dīsi nannu
gogaru diyyam̐gā nādanim̐ gori tiṭṭarādā
(||ela||)
paṭṭabudevulavu nībadi nādo mām̐ṭāḍide
ṟaṭṭusese vīḍa nannūṟage nīvu
mĕṭṭibaṭṭu kādam̐ḍu menavāni payimova
suṭṭi kām̐giliṁcham̐gānu sūḍuvaṭṭarādā
(||ela||)
yichchagurālavu nāgu nidam̐ḍu viḍĕ miyyam̐gā
kŏchchigŏchchi vĕṁgĕmule kuppavĕṭṭevu
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nannum̐ gūḍam̐gānu
pachchiradulam̐ jŏkkiṁchi paṁtamāḍarādā