Ela poddulu gadabe vimtigadagu raavayyaa

ఏల పొద్దులు గడపే వింతికడకు రావయ్యా
Language

(॥పల్లవి॥)
ఏల పొద్దులు గడపే వింతికడకు రావయ్యా
నాలిసేయ నిఁకవద్దు నమ్మి యాపె వున్నది

(॥॥)
చక్కనిసతిమోమున చంద్రోదయంబాయ
వెక్కసపునవ్వుల వెన్నెల గానె
చొక్కపుకొప్పువిరుల చుక్కలు గానుపించె
పక్కన నెంచితే పట్టపగలు రేయౌను

(॥॥)
సతికుచగిరులనేజక్కవలు జోడుగూడె
తతి వికసించెఁ గన్నులఁ దామరలు
మితిలేనిరత్న కాంతి మించె సూర్యోదయము
మతి నెంచుకొంటేను మాపే రేపౌను

(॥॥)
కలికిమెయి చెమటల గడియారపు నీరెక్కె
తెలిసిగ్గులనే పెండ్లితెర వేసెను
అలమె శ్రీవేంకటేశ అంతలో నీవు రాఁగాను
నెలవై యిట్టె వుండితే నిచ్చ కల్యాణమవును

(||pallavi||)
ela pŏddulu gaḍabe viṁtigaḍagu rāvayyā
nāliseya nim̐kavaddu nammi yābĕ vunnadi

(||||)
sakkanisadimomuna saṁdrodayaṁbāya
vĕkkasabunavvula vĕnnĕla gānĕ
sŏkkabugŏppuvirula sukkalu gānubiṁchĕ
pakkana nĕṁchide paṭṭabagalu reyaunu

(||||)
sadigusagirulanejakkavalu joḍugūḍĕ
tadi vigasiṁchĕm̐ gannulam̐ dāmaralu
midileniratna kāṁti miṁchĕ sūryodayamu
madi nĕṁchugŏṁṭenu mābe rebaunu

(||||)
kaligimĕyi sĕmaḍala gaḍiyārabu nīrĕkkĕ
tĕlisiggulane pĕṁḍlidĕra vesĕnu
alamĕ śhrīveṁkaḍeśha aṁtalo nīvu rām̐gānu
nĕlavai yiṭṭĕ vuṁḍide nichcha kalyāṇamavunu