Ela penamgulaadevu imdarilona

ఏల పెనఁగులాడేవు ఇందరిలోన
Language

(॥పల్లవి॥)
ఏల పెనఁగులాడేవు ఇందరిలోన
మేలువాఁడవై యాపె నేలుకోరాదా

(॥ఏల॥)
వేడుకతో జెలి నీపై వెన్నెలనవ్వులు చల్లె
కోడెకాఁడవు తుడుచుకొనఁగలవా
చూడఁగానే నిన్ను తనచూపులజిగు రంటించె
యీడ విడిపించుకొన నిఁకనోపేవా

(॥ఏల॥)
మక్కువతో నాపె నీకు మాఁటలనే చొక్కువేసె
వుక్కుమీరి లోనుగాక వుండఁగలవా
నిక్కిచూచి కోనగోర నీమర్మములెల్లా నెత్తె
మక్కళించి కూడక మానవచ్చునా

(॥ఏల॥)
కందువ నలమేల్మంగ కాఁగిటనే వలలోడ్డె
మందలించి తగులక మానఁగలవా
ముందె శ్రీవేంకటేశ మోవి నీకు లంచమిచ్చె
చెంది చెప్పినట్టు నీవు సేయకుండఁగలవా

(||pallavi||)
ela pĕnam̐gulāḍevu iṁdarilona
meluvām̐ḍavai yābĕ nelugorādā

(||ela||)
veḍugado jĕli nībai vĕnnĕlanavvulu sallĕ
koḍĕgām̐ḍavu tuḍusugŏnam̐galavā
sūḍam̐gāne ninnu tanasūbulajigu raṁṭiṁchĕ
yīḍa viḍibiṁchugŏna nim̐kanobevā

(||ela||)
makkuvado nābĕ nīgu mām̐ṭalane sŏkkuvesĕ
vukkumīri lonugāga vuṁḍam̐galavā
nikkisūsi konagora nīmarmamulĕllā nĕttĕ
makkaḽiṁchi kūḍaga mānavachchunā

(||ela||)
kaṁduva nalamelmaṁga kām̐giḍane valaloḍḍĕ
maṁdaliṁchi tagulaga mānam̐galavā
muṁdĕ śhrīveṁkaḍeśha movi nīgu laṁchamichchĕ
sĕṁdi sĕppinaṭṭu nīvu seyaguṁḍam̐galavā