ఏల పరాకున నుండే విందరిముందర నీవు
(॥పల్లవి॥)
ఏల పరాకున నుండే విందరిముందర నీవు
కాలుదొక్కీ నాపె నీవు కప్పవయ్యా రెంటెము
(॥ఏల॥)
చిప్పిలుఁ దమకమున సిగ్గులు నెరపుకొంటా
కప్పురము చేతికీఁచ్చీ గలికి నీకు
గొప్పగొప్పచన్నులకొనలు దాఁకించుకొంటా-
నప్పుడే బాగాలిచ్చీ నందుకొనవయ్యా
(॥ఏల॥)
చిన్నిచిన్నినవ్వులతో చెక్కుఁజెక్కు మోపుకొంటా
విన్నపాలెల్లాఁ జెసీ వెలఁది నీకు
నున్నని మోవితో నిన్ను నోరూరించుకొంటాను
వున్నతి సరసమాడీ నుత్తర మీవయ్యా
(॥ఏల॥)
మోమునఁ గళలు రేఁగ మోహములు చల్లుకొంటా
గామిడియై కాఁగిలించీఁ గామిని నిన్ను
అముక శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
నీమనసు చొక్కించె మన్నించవయ్యా
(||pallavi||)
ela parāguna nuṁḍe viṁdarimuṁdara nīvu
kāludŏkkī nābĕ nīvu kappavayyā rĕṁṭĕmu
(||ela||)
sippilum̐ damagamuna siggulu nĕrabugŏṁṭā
kappuramu sedigīm̐schī galigi nīgu
gŏppagŏppasannulagŏnalu dām̐kiṁchugŏṁṭā-
nappuḍe bāgālichchī naṁdugŏnavayyā
(||ela||)
sinnisinninavvulado sĕkkum̐jĕkku mobugŏṁṭā
vinnabālĕllām̐ jĕsī vĕlam̐di nīgu
nunnani movido ninnu norūriṁchugŏṁṭānu
vunnadi sarasamāḍī nuttara mīvayyā
(||ela||)
momunam̐ gaḽalu rem̐ga mohamulu sallugŏṁṭā
gāmiḍiyai kām̐giliṁchīm̐ gāmini ninnu
amuga śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
nīmanasu sŏkkiṁchĕ manniṁchavayyā