Ela pamtaalaadevu imtesi maadonu

ఏల పంతాలాడేవు ఇంతేసి మాతోను
Language

(॥పల్లవి॥)
ఏల పంతాలాడేవు ఇంతేసి మాతోను
సోలగిలి యాపె దిక్కు చూడకుండఁగలవా

(॥॥)
చెలియ చూచినచూపు చీఁకటిలోవెన్నెల
అలవోక మాట బయలువందిలి
తళుకుమోవితీపు తంగెటఁబెట్టినజున్ను
తలఁచుకో ఆపెఁబాసి దరిఇంచఁగలవా

(॥॥)
ముదితచక్కఁదనము ముంగిటినిధానము
వెదచల్లేనవ్వు చలివెన్నెలతేట
పొదలుఁ జన్నులు కడివోనివూగుత్తులు
సదరాన నీచలము సాదించఁగలవా

(॥॥)
పడఁతి మేనిచాయ బంగారులోనినిగ్గు
జడియనికాఁగిలి జాజులశయ్య
అడరి శ్రీవేంకటేశ అట్టె యీపెఁ గూడితివి
మెడఁ గట్టుకొందుగాక మితిమీరఁగలవా

(||pallavi||)
ela paṁtālāḍevu iṁtesi mādonu
solagili yābĕ dikku sūḍaguṁḍam̐galavā

(||||)
sĕliya sūsinasūbu sīm̐kaḍilovĕnnĕla
alavoga māḍa bayaluvaṁdili
taḽugumovidību taṁgĕḍam̐bĕṭṭinajunnu
talam̐sugo ābĕm̐bāsi dariiṁcham̐galavā

(||||)
mudidasakkam̐danamu muṁgiḍinidhānamu
vĕdasallenavvu salivĕnnĕladeḍa
pŏdalum̐ jannulu kaḍivonivūguttulu
sadarāna nīsalamu sādiṁcham̐galavā

(||||)
paḍam̐ti menisāya baṁgāruloniniggu
jaḍiyanigām̐gili jājulaśhayya
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ yībĕm̐ gūḍidivi
mĕḍam̐ gaṭṭugŏṁdugāga midimīram̐galavā