ఏల పచ్చి సేసేవు నన్నిందరిలోనా
(॥పల్లవి॥)
ఏల పచ్చి సేసేవు నన్నిందరిలోనా
యేలినవాఁడవు నీవు ఇల్లాల నేను
(॥ఏల॥)
గుట్టుతోడిదాననని గోర నన్నూఁదకుమని
నెట్టుకొని మొక్కితిఁగా నేను నీకు
చిట్టకాలు మానుమని సిగ్గువరచుకుమని
గట్టిగా నీ చెక్కు నొక్కి కడు వేఁడుకొంటిఁగా
(॥ఏల॥)
పెనఁగులాడకుమని పిసుకకు చన్నులని
వినయము సేసితిఁగా వేమారు నీకు
వొనర బొంకకుమని వొట్టులు వెట్టకుమని
యెనసి నే నిట్టే సేవలెల్లాఁ జేసితిఁగా
(॥ఏల॥)
యెప్పుడూఁ బాయకుమని యిన్నిటా వలతునని
చెప్పితిఁగా ప్రియములు సేనమారులు
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
మెప్పించి రతుల నీతో మేలము తాడితిఁగా
(||pallavi||)
ela pachchi sesevu nanniṁdarilonā
yelinavām̐ḍavu nīvu illāla nenu
(||ela||)
guṭṭudoḍidānanani gora nannūm̐dagumani
nĕṭṭugŏni mŏkkidim̐gā nenu nīgu
siṭṭagālu mānumani sigguvarasugumani
gaṭṭigā nī sĕkku nŏkki kaḍu vem̐ḍugŏṁṭim̐gā
(||ela||)
pĕnam̐gulāḍagumani pisugagu sannulani
vinayamu sesidim̐gā vemāru nīgu
vŏnara bŏṁkagumani vŏṭṭulu vĕṭṭagumani
yĕnasi ne niṭṭe sevalĕllām̐ jesidim̐gā
(||ela||)
yĕppuḍūm̐ bāyagumani yinniḍā valadunani
sĕppidim̐gā priyamulu senamārulu
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu nīvu
mĕppiṁchi radula nīdo melamu tāḍidim̐gā