ఏల నిన్ను దూరేము యెఱఁగమా నే మంతేసి
(॥పల్లవి॥)
ఏల నిన్ను దూరేము యెఱఁగమా నే మంతేసి
మేలు నిన్ను మెచ్చితిమి మేఁటిదొర వౌదువు
(॥ఏల॥)
వాసి వంతెరిఁగి నీవు వరుసతో నడపితే
యీసడించవచ్చేరా యెవ్వరైనాను
సేసవెట్టినట్లనే సేవలు సేయించుకొంటే
తోసి పోనాడేవారికి దోసము గాదా
(॥ఏల॥)
తగువు దప్పక నీవు దండనే కాచుకుండితే
యెగసక్కెము లాడుదురా యెవ్వరైనాను
తగులై నీవందరిపై దయగలిగుండఁగాను
పగలు నీపైఁ జూప పంతమా యేమైనా
(॥ఏల॥)
గుట్టుతోఁ గూడి నీమంచిగుణము నెరపఁగాను
యిట్టునట్టుఁ గొసరరా యెవ్వరైనాను
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
రట్టుసేయము రావయ్య యిట్టె మాయింటికి
(||pallavi||)
ela ninnu dūremu yĕṟam̐gamā ne maṁtesi
melu ninnu mĕchchidimi mem̐ṭidŏra vauduvu
(||ela||)
vāsi vaṁtĕrim̐gi nīvu varusado naḍabide
yīsaḍiṁchavachcherā yĕvvarainānu
sesavĕṭṭinaṭlane sevalu seyiṁchugŏṁṭe
tosi ponāḍevārigi dosamu gādā
(||ela||)
taguvu dappaga nīvu daṁḍane kāsuguṁḍide
yĕgasakkĕmu lāḍudurā yĕvvarainānu
tagulai nīvaṁdaribai dayagaliguṁḍam̐gānu
pagalu nībaim̐ jūba paṁtamā yemainā
(||ela||)
guṭṭudom̐ gūḍi nīmaṁchiguṇamu nĕrabam̐gānu
yiṭṭunaṭṭum̐ gŏsararā yĕvvarainānu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
raṭṭuseyamu rāvayya yiṭṭĕ māyiṁṭigi