Ela niluvam bettevu yimtesi valabulu

ఏల నిలువఁ బెట్టేవు యింతేసి వలపులు
Language

(॥పల్లవి॥)
ఏల నిలువఁ బెట్టేవు యింతేసి వలపులు
పోలికలు గాన రాదా పోయినందుకే

(॥ఏల॥)
ఆన వెట్టేవు నామీఁద నక్కర గల నంటాను
కాని కాని అందు కేమి కడమా నేఁడు
యీనిజము లెంచఁ బోతే యీరుదియ్యఁ బేనువచ్చు
వోరి నన్ను గుట్టుతోనె నూరకుండ నియ్యరా

(॥ఏల॥)
తారుకాణించ వచ్చేవు తలఁతు న న్నంటాను
సారె సారె నందు కేమి చాలదా నేఁడు
మారుబాణము లెంచితే మంచముకిందే నుయ్యి
నేరుపుతోఁ బరాకున నెత్త మాడ నియ్యరా

(॥ఏల॥)
పులకలే చూపేవు పోంది కరఁగితి నంటా
తలతల అందు కేమి తగదా నేఁడు
యెలమితో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
పలుకుఁబంతము చెల్లె భావించుకో నియ్యరా

(||pallavi||)
ela niluvam̐ bĕṭṭevu yiṁtesi valabulu
poligalu gāna rādā poyinaṁduge

(||ela||)
āna vĕṭṭevu nāmīm̐da nakkara gala naṁṭānu
kāni kāni aṁdu kemi kaḍamā nem̐ḍu
yīnijamu lĕṁcham̐ bode yīrudiyyam̐ benuvachchu
vori nannu guṭṭudonĕ nūraguṁḍa niyyarā

(||ela||)
tārugāṇiṁcha vachchevu talam̐tu na nnaṁṭānu
sārĕ sārĕ naṁdu kemi sāladā nem̐ḍu
mārubāṇamu lĕṁchide maṁchamugiṁde nuyyi
nerubudom̐ barāguna nĕtta māḍa niyyarā

(||ela||)
pulagale sūbevu poṁdi karam̐gidi naṁṭā
taladala aṁdu kemi tagadā nem̐ḍu
yĕlamido śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
palugum̐baṁtamu sĕllĕ bhāviṁchugo niyyarā