ఏల నీకు వెరపూ ఇన్నిటా గెలిచితివి
(॥పల్లవి॥)
ఏల నీకు వెరపూ ఇన్నిటా గెలిచితివి
నాలి మాని నీతో నేను నవ్వుచుండఁగాను
(॥ఏల॥)
మంతనాన నీవాపెతో మాటలాడిన సుద్దులు
ఇంతయు నాతోఁ జెప్పి రిందరు నేఁడు
యెంతకెంత సేసి నాతో యే లానలు వెట్టేవు
రంతుసేసి నిన్ను నేను రవ్వపెట్టేనా
(॥ఏల॥)
సిగ్గువడ కిందరునుఁ జేసిన సేఁతలెల్ల
నిగ్గుల సోరణగండ్ల నేఁ జూచితి
అగ్గమై సాకిరులేల అట్టె నాకుఁ దెలిపేవు
తగ్గించి విన్నిఁక నేను తలవంపించేనా
(॥ఏల॥)
కలసిన మీలోని కాఁపిరాలు నిన్నరేయి
కలలోనే కంటి శ్రీవేంకటగిరీశా
చెలఁగి నన్నిట్టె కూడి చెక్కు లేల నొక్కేవు
పలుమారు యిఁక నిన్నుఁ బంగించేనా
(||pallavi||)
ela nīgu vĕrabū inniḍā gĕlisidivi
nāli māni nīdo nenu navvusuṁḍam̐gānu
(||ela||)
maṁtanāna nīvābĕdo māḍalāḍina suddulu
iṁtayu nādom̐ jĕppi riṁdaru nem̐ḍu
yĕṁtagĕṁta sesi nādo ye lānalu vĕṭṭevu
raṁtusesi ninnu nenu ravvabĕṭṭenā
(||ela||)
sigguvaḍa kiṁdarunum̐ jesina sem̐talĕlla
niggula soraṇagaṁḍla nem̐ jūsidi
aggamai sāgirulela aṭṭĕ nāgum̐ dĕlibevu
taggiṁchi vinnim̐ka nenu talavaṁpiṁchenā
(||ela||)
kalasina mīloni kām̐pirālu ninnareyi
kalalone kaṁṭi śhrīveṁkaḍagirīśhā
sĕlam̐gi nanniṭṭĕ kūḍi sĕkku lela nŏkkevu
palumāru yim̐ka ninnum̐ baṁgiṁchenā