Ela neegu nimtaguttu yemigattugone vimdu

ఏల నీకు నింతగుట్టు యేమిగట్టుకొనే విందు
Language

(॥పల్లవి॥)
ఏల నీకు నింతగుట్టు యేమిగట్టుకొనే విందు
మేలిమిచేఁత నిండితే మెచ్చకుండేరా

(॥ఏల॥)
కొత్తగందవొడి చల్లు కొనేవు నీమేనినిండా
చిత్తడి చెమటలకు సిగ్గయ్యీనా
హత్తి సే సేవు విడేలు అట్టె మోవి విప్పి యైతే
ముత్తరము చెలులెల్లా ముంచి నవ్వేరా

(॥ఏల॥)
నేరుపుతో పువ్వుదండ నెత్తిఁ జుట్టుకొనేవు
బారపు జాఱు దురుము పట్టిఇచ్చీనా
సారె విసరుకొనేవు చప్పడుగా నింతలోనె
ఆ రీతి బుసకొట్లు నీకాఱ డయ్యీనా

(॥ఏల॥)
ముదిత లిందరిలోనా ముసు(సుఁ)గు వెట్టుకొనేవు
మదనకళల కిది మరఁగయ్యీనా
కుదురై శ్రీ వేంకటశ కూడితి వలమేల్మంగను
పదరకు మింతలోనె పచ్చి దోఁచీనా

(||pallavi||)
ela nīgu niṁtaguṭṭu yemigaṭṭugŏne viṁdu
melimisem̐ta niṁḍide mĕchchaguṁḍerā

(||ela||)
kŏttagaṁdavŏḍi sallu kŏnevu nīmeniniṁḍā
sittaḍi sĕmaḍalagu siggayyīnā
hatti se sevu viḍelu aṭṭĕ movi vippi yaide
muttaramu sĕlulĕllā muṁchi navverā

(||ela||)
nerubudo puvvudaṁḍa nĕttim̐ juṭṭugŏnevu
bārabu jāṟu durumu paṭṭiichchīnā
sārĕ visarugŏnevu sappaḍugā niṁtalonĕ
ā rīdi busagŏṭlu nīgāṟa ḍayyīnā

(||ela||)
mudida liṁdarilonā musu(sum̐)gu vĕṭṭugŏnevu
madanagaḽala kidi maram̐gayyīnā
kudurai śhrī veṁkaḍaśha kūḍidi valamelmaṁganu
padaragu miṁtalonĕ pachchi dom̐sīnā