ఏల నీకు జాణతనా లింతలో నాతో
(॥పల్లవి॥)
ఏల నీకు జాణతనా లింతలో నాతో
కోలుముందై తియ్యఁబోతే గోడపై సున్నాలు
(॥ఏల॥)
మగనాలిమాటలు మంచినీటితేటలు
తెగనాడ రట్టే మోవితేనెవూటలు
సొగసి కొలనిదరిఁ జూచితివి తొల్లి నీవు
నగ నేల నీ వలపు నానని సనిగెలు
(॥ఏల॥)
వెలయాలిచేఁతలు వింతబయలింతలు
కొలదిఁవెట్టిరు కొనగోరిగీఁతలు
కలుగుఁబో యింకా నీవు గడియించుకొంటెను
పిలిచిపెట్టఁగఁ బోతే బియ్యపుఁబణ్యారము
(॥ఏల॥)
జవరాలిపొందులు చలివేఁడివిందులు
నవకపుచన్నులు గొనాలగొందులు
యివల శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
కనగూడకున్న చింతకాయలకజ్జా యమూ
(||pallavi||)
ela nīgu jāṇadanā liṁtalo nādo
kolumuṁdai tiyyam̐bode goḍabai sunnālu
(||ela||)
maganālimāḍalu maṁchinīḍideḍalu
tĕganāḍa raṭṭe movidenĕvūḍalu
sŏgasi kŏlanidarim̐ jūsidivi tŏlli nīvu
naga nela nī valabu nānani sanigĕlu
(||ela||)
vĕlayālisem̐talu viṁtabayaliṁtalu
kŏladim̐vĕṭṭiru kŏnagorigīm̐talu
kalugum̐bo yiṁkā nīvu gaḍiyiṁchugŏṁṭĕnu
pilisibĕṭṭam̐gam̐ bode biyyabum̐baṇyāramu
(||ela||)
javarālibŏṁdulu salivem̐ḍiviṁdulu
navagabusannulu gŏnālagŏṁdulu
yivala śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
kanagūḍagunna siṁtagāyalagajjā yamū