(॥పల్లవి॥)
ఏల నీకత లిందరు నెఱఁగనివా
నాలికకొన నీ నయము చూపేవా
(॥ఏల॥)
వో నిలువవయ్య వొద్దు మమ్ముఁ బట్టకు నీఁ
దేహమందె నీగుణాలు తెలుపుదునా
యీహల నీవేగిరము యీడ నేఁటికి నీఁ
మోహములు యీచెలులముందరఁ జూపేవా
(॥ఏల॥)
కాని ని వంతమాయ గప్పకు మాపయి
నీనిజములోనే కల్ల నిలుపింతునా
నానఁబెట్టి సెలవుల నవ్వ నేఁటికి
పూనిన నీశాంత మీడఁ బోగుసేయవలెనా
(॥ఏల॥)
తో తో వొరగకుమా తొడ మీఁదను
ఆతలిసుద్ది నీచేఁ గద్దనిపింతునా
యేతుల నన్ను శ్రీవేంకటేశ కూడితి
నీతలఁపులోనిదయ నేఁడె చూపవలెనా
(||pallavi||)
ela nīgada liṁdaru nĕṟam̐ganivā
nāligagŏna nī nayamu sūbevā
(||ela||)
vo niluvavayya vŏddu mammum̐ baṭṭagu nīm̐
dehamaṁdĕ nīguṇālu tĕlubudunā
yīhala nīvegiramu yīḍa nem̐ṭigi nīm̐
mohamulu yīsĕlulamuṁdaram̐ jūbevā
(||ela||)
kāni ni vaṁtamāya gappagu mābayi
nīnijamulone kalla nilubiṁtunā
nānam̐bĕṭṭi sĕlavula navva nem̐ṭigi
pūnina nīśhāṁta mīḍam̐ boguseyavalĕnā
(||ela||)
to to vŏragagumā tŏḍa mīm̐danu
ādalisuddi nīsem̐ gaddanibiṁtunā
yedula nannu śhrīveṁkaḍeśha kūḍidi
nīdalam̐pulonidaya nem̐ḍĕ sūbavalĕnā