ఏల నవ్వే వప్పటిని యిట్టె నా మొగము చూచి
(॥పల్లవి॥)
ఏల నవ్వే వప్పటిని యిట్టె నా మొగము చూచి
మేలుగల చెలులైతే మెరయక వుందురా
(॥ఏల॥)
వొక్కసతి వుర మెక్కె వొక్కసతి వీఁపెక్కె
చిక్కించి వేరొకసతి శిర సెక్కెను
తక్కక యింతులజాడ దగ్గరఁ బిలిచితేను
మిక్కిలి లెక్కసేతురా మీరుదురు గాక
(॥ఏల॥)
వెదకించె నొకలేమ వెంటఁ దిప్పె నొకలేమ
వుదుటై రచ్చకుఁ దీసె నొకలేమ
యెదుటఁ గాంతలజాడ యేపాటిమన్నించినాను
తుద కెక్కకుండుదురా తూరి యెంతైనాను
(॥ఏలా॥)
నీకంటేఁ బొడ వొకతె నీరిపు నేసె నొకతె
మేకొని పూవులనే భ్రమించె నొకతె
యీకడ శ్రీవేంకటేశ యిందులో నే నొకతెను
జోక నలమేల్మంగను చొక్కించి మెప్పించనా
(||pallavi||)
ela navve vappaḍini yiṭṭĕ nā mŏgamu sūsi
melugala sĕlulaide mĕrayaga vuṁdurā
(||ela||)
vŏkkasadi vura mĕkkĕ vŏkkasadi vīm̐pĕkkĕ
sikkiṁchi verŏgasadi śhira sĕkkĕnu
takkaga yiṁtulajāḍa daggaram̐ bilisidenu
mikkili lĕkkasedurā mīruduru gāga
(||ela||)
vĕdagiṁchĕ nŏgalema vĕṁṭam̐ dippĕ nŏgalema
vuduḍai rachchagum̐ dīsĕ nŏgalema
yĕduḍam̐ gāṁtalajāḍa yebāḍimanniṁchinānu
tuda kĕkkaguṁḍudurā tūri yĕṁtainānu
(||elā||)
nīgaṁṭem̐ bŏḍa vŏgadĕ nīribu nesĕ nŏgadĕ
megŏni pūvulane bhramiṁchĕ nŏgadĕ
yīgaḍa śhrīveṁkaḍeśha yiṁdulo ne nŏgadĕnu
joga nalamelmaṁganu sŏkkiṁchi mĕppiṁchanā