ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన
(॥పల్లవి॥)
ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన
తిలుపడనేర నేను తెలివేకాని
(॥ఏల॥)
నగి నగి తిట్టినామ నాతో నలిగినామ
వెగటులేదు నాకు వేడుకేకాని
మొగసి మాటాడినాను మోనాన నీవుండినాను
జగడములేదు నాకు చనవే కాని
(॥ఏల॥)
కన్నులఁ గొసరినాను కాఁకల విసరినాను
చిన్నఁబోదు నామోము చెలువే కాని
సన్నలనే తిట్టినాను చాయలనన్నాడినాను
యెన్న నెగ్గుగాదు నాకు నితవే కాని
(॥ఏల॥)
పై కొనక మానినాను పరాకు సేసినాను
నా కెందు నెరవు లేదు నలుపేకాని
శ్రీ కాంత నేను నీవు శ్రీ వేంకటకేశుఁడవు
యేకమైతి మెదురేది యిచ్చకమే కాని
(||pallavi||)
ela nannu vem̐ḍugŏne viḍu nīve nem̐ gāna
tilubaḍanera nenu tĕlivegāni
(||ela||)
nagi nagi tiṭṭināma nādo naligināma
vĕgaḍuledu nāgu veḍugegāni
mŏgasi māḍāḍinānu monāna nīvuṁḍinānu
jagaḍamuledu nāgu sanave kāni
(||ela||)
kannulam̐ gŏsarinānu kām̐kala visarinānu
sinnam̐bodu nāmomu sĕluve kāni
sannalane tiṭṭinānu sāyalanannāḍinānu
yĕnna nĕggugādu nāgu nidave kāni
(||ela||)
pai kŏnaga māninānu parāgu sesinānu
nā kĕṁdu nĕravu ledu nalubegāni
śhrī kāṁta nenu nīvu śhrī veṁkaḍageśhum̐ḍavu
yegamaidi mĕduredi yichchagame kāni