Ela nannu vemdugone vemamdu ne nimdugu

ఏల నన్ను వేఁడుకొనే వేమందు నే నిందుకు
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను వేఁడుకొనే వేమందు నే నిందుకు
గాలినిట్టూర్పుల మోత కానరాదా నీకు

(॥ఏల॥)
మనసు దిప్పుక నీతో మాటలాడేఁ గాని నా
తనువుపై కాఁకలైతే తలఁచరాదు
చనవు సేసుక నీతో సరసమాడేఁ గాని
కనుఁగొని లోనికెంపు కానరాదా నీకు

(॥ఏల॥)
నటన సేసుక నీతో నవ్వు నవ్వేఁగాని నేను
సటల నీ మాటలివి చవిగావు
తటుకునఁ బిలువఁగ దగ్గరి వచ్చితిఁ గాని
కటకటా నాగుణము గానరాదా నీకు

(॥ఏల॥)
కడు బలిమిసేయఁగాఁ గౌఁగిలించేఁ గాని నిన్ను
వడిసేచెమటలు వశము గావు
యెడలేక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
కడలేని నా రతులు గానరాదా నీకు

(||pallavi||)
ela nannu vem̐ḍugŏne vemaṁdu ne niṁdugu
gāliniṭṭūrbula moda kānarādā nīgu

(||ela||)
manasu dippuga nīdo māḍalāḍem̐ gāni nā
tanuvubai kām̐kalaide talam̐sarādu
sanavu sesuga nīdo sarasamāḍem̐ gāni
kanum̐gŏni lonigĕṁpu kānarādā nīgu

(||ela||)
naḍana sesuga nīdo navvu navvem̐gāni nenu
saḍala nī māḍalivi savigāvu
taḍugunam̐ biluvam̐ga daggari vachchidim̐ gāni
kaḍagaḍā nāguṇamu gānarādā nīgu

(||ela||)
kaḍu balimiseyam̐gām̐ gaum̐giliṁchem̐ gāni ninnu
vaḍisesĕmaḍalu vaśhamu gāvu
yĕḍalega śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
kaḍaleni nā radulu gānarādā nīgu