ఏల నన్ను వేడుకొనే వేమి బాఁతి నేను
(॥పల్లవి॥)
ఏల నన్ను వేడుకొనే వేమి బాఁతి నేను
ఆలి మగని వరుసలంత నాకుఁ జాలదా
(॥ఏల॥)
సారె సారె నీమీఁద సణఁగులే చల్లితిని
మేరలు మీరి నవ్వితి మేనవావిని
యీరీతి నా యాడుజన్మ మింత దూరు గట్టె నాకు
చేరి నీ మొగము చూడ సిగ్గు గాదా నాకు
(॥ఏల॥)
కన్నులనే తిట్టితిని కాఁకలనే జంకించితి
మిన్నక కొసరితిని మేనవావిని
నన్ను నింతేసి సేసెను నా జవ్వనమదము
అన్నిటా నీతో నాకు నప్పటి నామాటలు
(॥ఏల॥)
కలసినరతివేళఁ గాలు చేయి దాకించితి
మెలఁగి మోవెంగిలంటె మేనవావిని
యెలమి శ్రీవేంకటేశ యింత సేసె నాపొందు
పిలిచి మొక్కుట గాక బిగియఁ జోటేది
(||pallavi||)
ela nannu veḍugŏne vemi bām̐ti nenu
āli magani varusalaṁta nāgum̐ jāladā
(||ela||)
sārĕ sārĕ nīmīm̐da saṇam̐gule sallidini
meralu mīri navvidi menavāvini
yīrīdi nā yāḍujanma miṁta dūru gaṭṭĕ nāgu
seri nī mŏgamu sūḍa siggu gādā nāgu
(||ela||)
kannulane tiṭṭidini kām̐kalane jaṁkiṁchidi
minnaga kŏsaridini menavāvini
nannu niṁtesi sesĕnu nā javvanamadamu
anniḍā nīdo nāgu nappaḍi nāmāḍalu
(||ela||)
kalasinaradiveḽam̐ gālu seyi dāgiṁchidi
mĕlam̐gi movĕṁgilaṁṭĕ menavāvini
yĕlami śhrīveṁkaḍeśha yiṁta sesĕ nābŏṁdu
pilisi mŏkkuḍa gāga bigiyam̐ joḍedi