Ela nannu sodimche vemdaamkaanu

ఏల నన్ను సోదించె వెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను సోదించె వెందాఁకాను
నీ లాగులు నా లాగులు నీకే తెలుసును

(॥ఏల॥)
తక్కించి నీవు నన్నుఁ దప్పులువట్టేవు గాక
యెక్కువనామనసు నీవెఱఁగనిదా
చెక్కు చేతఁబట్టుకొని సిగ్గువడి వున్నదాన
నిక్కి నావిన్నపాలెల్లా నీకే తెలుసును

(॥ఏల॥)
మంతనాన నాతోను మాఁటలు దీసేవుగాక
యింతట నాగుణము నీవెఱఁగనిదా
బంతి నిందరిలో మానాపతినై నేనున్నదాన
దొంతునాయాస నీకు తొల్లే తెలుసును

(॥ఏల॥)
నవ్వుతానే నీవు నన్ను నంటునఁ గూడితిగాక
యివ్వల నానేరువు నీవెఱఁగనిదా
జవ్వనపు శ్రీవేంకటేశ్వర యలమేల్ మంగను
పువ్వువంటిపొందు నీకుఁ బూఁచితేఁ దెలుసును

(||pallavi||)
ela nannu sodiṁchĕ vĕṁdām̐kānu
nī lāgulu nā lāgulu nīge tĕlusunu

(||ela||)
takkiṁchi nīvu nannum̐ dappuluvaṭṭevu gāga
yĕkkuvanāmanasu nīvĕṟam̐ganidā
sĕkku sedam̐baṭṭugŏni sigguvaḍi vunnadāna
nikki nāvinnabālĕllā nīge tĕlusunu

(||ela||)
maṁtanāna nādonu mām̐ṭalu dīsevugāga
yiṁtaḍa nāguṇamu nīvĕṟam̐ganidā
baṁti niṁdarilo mānābadinai nenunnadāna
dŏṁtunāyāsa nīgu tŏlle tĕlusunu

(||ela||)
navvudāne nīvu nannu naṁṭunam̐ gūḍidigāga
yivvala nāneruvu nīvĕṟam̐ganidā
javvanabu śhrīveṁkaḍeśhvara yalamel maṁganu
puvvuvaṁṭibŏṁdu nīgum̐ būm̐sidem̐ dĕlusunu