Ela nannu rammaneeve imtesaalu

ఏల నన్ను రమ్మనీవే ఇంతేచాలు
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను రమ్మనీవే ఇంతేచాలు
యేలినాఁడు తొల్లె నన్ను నింతే చాలు

(॥॥)
కూడి తనచేఁతలకు గోపగింతునో యేమో
యీడనుండి మొక్కితి నాకింతేచాలు
వోడక సారెకు రాఁగా నొగరౌనో తీపౌనో
యేడకేడ తననా కింతేచాలు

(॥॥)
కామిను లెందరు లేరు కాఁకలు చల్లఁ దనకు
యేమిగారణము నే మింతేచాలు
నేమము దప్పకుంటే నేరుపౌసో నేరుమౌనో
యీమాటు వోయిరావే యింతేచాలు

(॥॥)
బెట్టి నవ్వ నీరుదియ్యఁబేనువచ్చు నిఁకనేల
యెట్టైనా వచ్చెఁ దా నీడ కింతే చాలు
వొట్టుక శ్రీ వేంకటేశుఁడొనగూడె నిప్పు డిట్టె
యెట్టుసేసీనాఁ జెల్లె నింతేచాలు

(||pallavi||)
ela nannu rammanīve iṁtesālu
yelinām̐ḍu tŏllĕ nannu niṁte sālu

(||||)
kūḍi tanasem̐talagu gobagiṁtuno yemo
yīḍanuṁḍi mŏkkidi nāgiṁtesālu
voḍaga sārĕgu rām̐gā nŏgarauno tībauno
yeḍageḍa tananā kiṁtesālu

(||||)
kāminu lĕṁdaru leru kām̐kalu sallam̐ danagu
yemigāraṇamu ne miṁtesālu
nemamu dappaguṁṭe nerubauso nerumauno
yīmāḍu voyirāve yiṁtesālu

(||||)
bĕṭṭi navva nīrudiyyam̐benuvachchu nim̐kanela
yĕṭṭainā vachchĕm̐ dā nīḍa kiṁte sālu
vŏṭṭuga śhrī veṁkaḍeśhum̐ḍŏnagūḍĕ nippu ḍiṭṭĕ
yĕṭṭusesīnām̐ jĕllĕ niṁtesālu