Ela nannu norasevu yimdarilona

ఏల నన్ను నొరసేవు యిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను నొరసేవు యిందరిలోన
కేలి నిన్నిటా నూడిగెపుదాన నేను

(॥॥)
పంతమాడఁ గలవా పతివి నీతో నేను
కాంతను ఇచ్చకమాడఁ గలఁ గాక
చెంత నీతో బలిమిసేసి చూపవచ్చునా
మంతనాన నోర్చుకుండే మనవచ్చునా

(॥॥)
జంకిచేదాననా సరసుఁడవైన నిన్ను
అంకెల నవ్వులు నవ్వేయందుకుఁ గాక
సంకెలేక విన్ను మరి సాదించఁ దగవా
వుంక నీవు చెప్పినట్టోడఁ బడేఁ గాక

(॥॥)
జీరదీసేదాననా ఏ వేంకటేశ నీకు
మేరతోడ నిన్నుఁ గూడి మించితిఁ గాక
ఆరజము సేసి నిన్ను అవుఁ గాదనఁ గలనా
చేరి నీమన్ననలనే చెలఁ గుదుఁ గాక

(||pallavi||)
ela nannu nŏrasevu yiṁdarilona
keli ninniḍā nūḍigĕbudāna nenu

(||||)
paṁtamāḍam̐ galavā padivi nīdo nenu
kāṁtanu ichchagamāḍam̐ galam̐ gāga
sĕṁta nīdo balimisesi sūbavachchunā
maṁtanāna norsuguṁḍe manavachchunā

(||||)
jaṁkisedānanā sarasum̐ḍavaina ninnu
aṁkĕla navvulu navveyaṁdugum̐ gāga
saṁkĕlega vinnu mari sādiṁcham̐ dagavā
vuṁka nīvu sĕppinaṭṭoḍam̐ baḍem̐ gāga

(||||)
jīradīsedānanā e veṁkaḍeśha nīgu
meradoḍa ninnum̐ gūḍi miṁchidim̐ gāga
ārajamu sesi ninnu avum̐ gādanam̐ galanā
seri nīmannanalane sĕlam̐ gudum̐ gāga