Ela nannu norasevu yemayyaa neevu

ఏల నన్ను నొరసేవు యేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను నొరసేవు యేమయ్యా నీవు
మేలులోనిదానిఁగాక మెరమెచ్చుదాననా

(॥ఏల॥)
వింతలేక నీకు నేను వినయాలే సేతుఁగాక
పంతమాడేదాననా పలుమారును
కాంతుఁడవు నిన్నుఁజూచి కన్నుల మొక్కుదుఁగాక
జంతతనము నిన్ను సాదించేదాననా

(॥ఏల॥)
పొసఁగఁగ మాఁటలాడి పొందుసేసేదానఁగాక
కొసరేటిదాననా గుంపించి నిన్ను
సుసరాన నిచ్చకమై చూపేటిదానఁగాక
అసురుసురై బొమ్మల నద్దలించేదాననా

(॥ఏల॥)
కప్పురము నోరి కిచ్చి కాఁగిలొంచేదానఁగాక
తప్పులెంచేదాననా దంటతనాన
యిప్పుడు శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
వొప్పుగ నన్నేలితివి వొడ్డుకొనేదాననా

(||pallavi||)
ela nannu nŏrasevu yemayyā nīvu
melulonidānim̐gāga mĕramĕchchudānanā

(||ela||)
viṁtalega nīgu nenu vinayāle sedum̐gāga
paṁtamāḍedānanā palumārunu
kāṁtum̐ḍavu ninnum̐jūsi kannula mŏkkudum̐gāga
jaṁtadanamu ninnu sādiṁchedānanā

(||ela||)
pŏsam̐gam̐ga mām̐ṭalāḍi pŏṁdusesedānam̐gāga
kŏsareḍidānanā guṁpiṁchi ninnu
susarāna nichchagamai sūbeḍidānam̐gāga
asurusurai bŏmmala naddaliṁchedānanā

(||ela||)
kappuramu nori kichchi kām̐gilŏṁchedānam̐gāga
tappulĕṁchedānanā daṁṭadanāna
yippuḍu śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
vŏppuga nannelidivi vŏḍḍugŏnedānanā