Ela nannu gabbiyane vimdugugaanu

ఏల నన్ను గబ్బియనే విందుకుగాను
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను గబ్బియనే విందుకుగాను
చాలా నవ్వితిఁ గాక చలమా నీతోను

(॥ఏల॥)
తెరలోఁ దురుమువట్టితీసి దూరులెల్లా దూరి
సరసమాడితిఁ గాక చలమా నీతో
వొరయుచుఁ గాతరాన వొడివట్టితీసి రతి- -
సరవి చూపితిఁగాక చలమా నీతోను

(॥ఏల॥)
బలిమిఁ జన్నుల నొత్తి పంతముతోడఁబెనఁగి
చలివాపితిఁగాక చలమా నీతో
ములువాఁడి కొనగోర నూఁది మోవిమీఁద గంటిసేసి
సలిగె చూపితిఁగాక చలమా నీతోను

(॥ఏల॥)
కవగూడి యేకతాన కాఁగిటిలోఁ జొక్కించి
జవళిఁ బైకొంటిఁగాక చలమా నీతో
ఇవల శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చవులు చూపితిఁగాక చలమా నీతోను

(||pallavi||)
ela nannu gabbiyane viṁdugugānu
sālā navvidim̐ gāga salamā nīdonu

(||ela||)
tĕralom̐ durumuvaṭṭidīsi dūrulĕllā dūri
sarasamāḍidim̐ gāga salamā nīdo
vŏrayusum̐ gādarāna vŏḍivaṭṭidīsi radi- -
saravi sūbidim̐gāga salamā nīdonu

(||ela||)
balimim̐ jannula nŏtti paṁtamudoḍam̐bĕnam̐gi
salivābidim̐gāga salamā nīdo
muluvām̐ḍi kŏnagora nūm̐di movimīm̐da gaṁṭisesi
saligĕ sūbidim̐gāga salamā nīdonu

(||ela||)
kavagūḍi yegadāna kām̐giḍilom̐ jŏkkiṁchi
javaḽim̐ baigŏṁṭim̐gāga salamā nīdo
ivala śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
savulu sūbidim̐gāga salamā nīdonu