ఏల నన్ను బుజ్జగించే వింతటిలోనె
(॥పల్లవి॥)
ఏల నన్ను బుజ్జగించే వింతటిలోనె
నాలితో నీ వేడ నున్నా నన్ను మానేవా
(॥ఏల నన్ను॥)
చిన్నఁబోయి వుండ నేల చెక్కు చేయి నాకేల
మన్నించి నీవే నాతో మాట లాడఁగా
మున్నె నీ కొప్పగించితి ముంచిన నా దేహ మెల్ల
నిన్న నేఁటి వారిమాట నే వినేనా
(॥ఏల నన్ను॥)
వెంగె మాడ నా కేల వేసరుకొనఁగ నేల
సంగతిగా నీవే నాతో సారె నవ్వఁగా
వుంగరము వెట్టితిని వున్నదాన నీకుఁ గాను
చెంగట నెవ్వరు నేమి చెప్పేరు యిఁకను
(॥ఏలనన్ను॥)
సిగ్గు వడ నా కేల సిరసు వంచఁగ నేల
దగ్గరి నీవె నాకు దక్కి వుండఁగా
నిగ్గుల శ్రీవెంకటేశ నీవే నన్ను గూడితివి
యెగ్గులు దప్పలు మరి యెంచ నేది యిందునూ
(||pallavi||)
ela nannu bujjagiṁche viṁtaḍilonĕ
nālido nī veḍa nunnā nannu mānevā
(||ela nannu||)
sinnam̐boyi vuṁḍa nela sĕkku seyi nāgela
manniṁchi nīve nādo māḍa lāḍam̐gā
munnĕ nī kŏppagiṁchidi muṁchina nā deha mĕlla
ninna nem̐ṭi vārimāḍa ne vinenā
(||ela nannu||)
vĕṁgĕ māḍa nā kela vesarugŏnam̐ga nela
saṁgadigā nīve nādo sārĕ navvam̐gā
vuṁgaramu vĕṭṭidini vunnadāna nīgum̐ gānu
sĕṁgaḍa nĕvvaru nemi sĕpperu yim̐kanu
(||elanannu||)
siggu vaḍa nā kela sirasu vaṁcham̐ga nela
daggari nīvĕ nāgu dakki vuṁḍam̐gā
niggula śhrīvĕṁkaḍeśha nīve nannu gūḍidivi
yĕggulu dappalu mari yĕṁcha nedi yiṁdunū