Ela nannodambarasere meere meeru

ఏల నన్నొడఁబరచేరే మీరే మీరు
Language

(॥పల్లవి॥)
ఏల నన్నొడఁబరచేరే మీరే మీరు
వేళ గాకున్నదాన వెనక తీసేనా

(॥ఏల॥)
వసమై యాతనికి నే వలచినదానను
కొసరి యే మైనా నిఁకఁ గోపగించేనా
ముసిముసినవ్వులతో మొక్కినట్టిదానను
సుసరాన మనసెల్లఁ జొక్కించకుండేనా

(॥ఏల॥)
చెచ్చెర నే మొదలనే సేసపాలదానను
మచ్చరము వెడరేఁచి మానఁబొయ్యేనా
తచ్చివేసి మంచానకు దాసి వున్న దానను
మెచ్చుగఁ గాఁగిట నించి మెప్పించకుండేనా

(॥ఏల॥)
పంత మిచ్చి తనచేత బాసగొన్న దానను
యింతలోఁ దా నేమనినా నేగ్గు వట్టేనా
చింత దీర నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు దానె
మంతనాన నాపొందు మరుపకుండేనా

(||pallavi||)
ela nannŏḍam̐barasere mīre mīru
veḽa gāgunnadāna vĕnaga tīsenā

(||ela||)
vasamai yādanigi ne valasinadānanu
kŏsari ye mainā nim̐kam̐ gobagiṁchenā
musimusinavvulado mŏkkinaṭṭidānanu
susarāna manasĕllam̐ jŏkkiṁchaguṁḍenā

(||ela||)
sĕchchĕra ne mŏdalane sesabāladānanu
machcharamu vĕḍarem̐si mānam̐bŏyyenā
tachchivesi maṁchānagu dāsi vunna dānanu
mĕchchugam̐ gām̐giḍa niṁchi mĕppiṁchaguṁḍenā

(||ela||)
paṁta michchi tanaseda bāsagŏnna dānanu
yiṁtalom̐ dā nemaninā neggu vaṭṭenā
siṁta dīra nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu dānĕ
maṁtanāna nābŏṁdu marubaguṁḍenā