ఏల నన్నొడఁబరచే విటు నిన్నుఁ గాదనేనా
(॥పల్లవి॥)
ఏల నన్నొడఁబరచే విటు నిన్నుఁ గాదనేనా
మేలమెరిఁగినవారి మెప్పించరాదా
(॥॥)
జాడల నాతో నీవు సమ్మతించఁ జెప్పేవు
ఆడరాదా తగవు నీ వాపెతోను
వేడుక కాఁడవు నీవు వెలఁదు లొద్దనున్నారు
పాడిపంతములెల్లాఁ బచరించరాదా
(॥॥)
గుట్టున నన్నెంత వేఁడుకొనేవు సారె సారెకు
అట్టె పెనఁగరాదా ఆపెతోను
చుట్టరికము నేర్తువు చూచే రూడిగపువారు
నెట్టుకొన్నసంతోసాలు నెరపఁగరాదా
(॥॥)
పోదిసేసి నన్ను నెంతపొదిగే విందుకుఁగాను
ఆదరించి కూడరాదా ఆపెతోను
యీదెస శ్రీవేంకటేశ యేలితి వాపెను నన్ను
పాదుగా సవతులలోఁ బాలించరాదా
(||pallavi||)
ela nannŏḍam̐barase viḍu ninnum̐ gādanenā
melamĕrim̐ginavāri mĕppiṁcharādā
(||||)
jāḍala nādo nīvu sammadiṁcham̐ jĕppevu
āḍarādā tagavu nī vābĕdonu
veḍuga kām̐ḍavu nīvu vĕlam̐du lŏddanunnāru
pāḍibaṁtamulĕllām̐ basariṁcharādā
(||||)
guṭṭuna nannĕṁta vem̐ḍugŏnevu sārĕ sārĕgu
aṭṭĕ pĕnam̐garādā ābĕdonu
suṭṭarigamu nerduvu sūse rūḍigabuvāru
nĕṭṭugŏnnasaṁtosālu nĕrabam̐garādā
(||||)
podisesi nannu nĕṁtabŏdige viṁdugum̐gānu
ādariṁchi kūḍarādā ābĕdonu
yīdĕsa śhrīveṁkaḍeśha yelidi vābĕnu nannu
pādugā savadulalom̐ bāliṁcharādā