Ela naagu naanadichche vemdaamkaanu

ఏల నాకు నానతిచ్చే వెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏల నాకు నానతిచ్చే వెందాఁకాను
వాలాయించి నీపొందు వాడికాయను

(॥ఏల॥)
ముయ్యంచున నీవు నాకు మోహించినమోహమెల్లా
తియ్యని నీమోవియందే దిష్టమాయను
ఇయ్యెడ నీవు నాకు నిచ్చేటిచనవులెల్ల
చయ్యన నీనవ్వులనే సతమాయను

(॥ఏల॥)
మచ్చికతో నీవు నన్ను మన్నించే మన్ననలెల్లా
కొచ్చి చూచేచూపులనే గురుతాయను
తచ్చి నీనాసంది తగులాయములెల్లాను
హెచ్చినసరసముల నిరవాయను

(॥ఏల॥)
ఇట్టె నీవు నన్ను నెడయనిబాసలెల్లా
నెట్టుకొన్నరతులలో నిజమాయను
గట్టిగా శ్రీవేంకటేశ కలసిననీకూటమి
వొట్టిన యిచ్చకముల నుఁ(నుం?)కు వాయను

(||pallavi||)
ela nāgu nānadichche vĕṁdām̐kānu
vālāyiṁchi nībŏṁdu vāḍigāyanu

(||ela||)
muyyaṁchuna nīvu nāgu mohiṁchinamohamĕllā
tiyyani nīmoviyaṁde diṣhṭamāyanu
iyyĕḍa nīvu nāgu nichcheḍisanavulĕlla
sayyana nīnavvulane sadamāyanu

(||ela||)
machchigado nīvu nannu manniṁche mannanalĕllā
kŏchchi sūsesūbulane gurudāyanu
tachchi nīnāsaṁdi tagulāyamulĕllānu
hĕchchinasarasamula niravāyanu

(||ela||)
iṭṭĕ nīvu nannu nĕḍayanibāsalĕllā
nĕṭṭugŏnnaradulalo nijamāyanu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasinanīgūḍami
vŏṭṭina yichchagamula num̐(nuṁ?)ku vāyanu