Ela naagu baamtibadi yemta vodambaraseeni

ఏల నాకు బాఁతిపడి యెంత వొడఁబరచీని
Language

(॥పల్లవి॥)
ఏల నాకు బాఁతిపడి యెంత వొడఁబరచీని
ఆలరీఁడు తను నెట్టు ఆసలఁ బెట్టేనే

(॥ఏల॥)
యెదురు మాటాడరాదు యేమని అడుగరాదు
కదిసి తనచే నెట్టు కత వినేనే
కదిమి వొత్తఁగరాదు కాలు చేయి వేయరాదు
పదపడి నేనెట్టు పక్కఁబండేనే

(॥ఏల॥)
దారిదప్పి నవ్వరాదు తమ్ముల మిడఁగరాదు
పేరడిగా తన్ను నెట్లు పెండ్లాడేనే
గోర గీరరాదు కడుఁగొసరి తిట్టఁగరాదు
యీరీతివానితో నెట్టు యేకత మాడేనే

(॥ఏల॥)
తప్పక చూడఁగరాదు తను బాసగొనరాదు
ఇప్పుడే శ్రీవేంకటేశు నెట్టు వంచేనే
కప్పి యలమేల్మంగ నే కడు నలఇంచరాదు
దప్పిదేర నన్నుఁ గూడె తన్ను నెట్టు మించేనే

(||pallavi||)
ela nāgu bām̐tibaḍi yĕṁta vŏḍam̐barasīni
ālarīm̐ḍu tanu nĕṭṭu āsalam̐ bĕṭṭene

(||ela||)
yĕduru māḍāḍarādu yemani aḍugarādu
kadisi tanase nĕṭṭu kada vinene
kadimi vŏttam̐garādu kālu seyi veyarādu
padabaḍi nenĕṭṭu pakkam̐baṁḍene

(||ela||)
dāridappi navvarādu tammula miḍam̐garādu
peraḍigā tannu nĕṭlu pĕṁḍlāḍene
gora gīrarādu kaḍum̐gŏsari tiṭṭam̐garādu
yīrīdivānido nĕṭṭu yegada māḍene

(||ela||)
tappaga sūḍam̐garādu tanu bāsagŏnarādu
ippuḍe śhrīveṁkaḍeśhu nĕṭṭu vaṁchene
kappi yalamelmaṁga ne kaḍu nala̮iṁcharādu
dappidera nannum̐ gūḍĕ tannu nĕṭṭu miṁchene