(॥పల్లవి॥)
ఏల నాతోనే నీకు యింతవలెనా
తాలిమితో నా చేఁతలు దక్కించుకోలేనా
(॥ఏల॥)
రాకపోకలనే నన్ను రాఁపుసేసి నీవింత
పైకొని నవ్వు నవ్వేవు పంతమా యిది
జోకల నీ సరితలు చూతమని వుంటిఁగాక
చీకాకుపరచి నిన్నుఁ జిక్కించలేనా
(॥ఏల॥)
ఇచ్చకమాడినమాట యెగసక్కెముగఁ జేసి
పచ్చి సేసేవిందరిలోఁ బంతమా యిది
వచ్చీరాక తొల్లే నీతో వాదొల్లకుందానఁ గాక
రచ్చకెక్కించి నిన్నిట్టె రవ్వ సేయనోపనా
(॥ఏల॥)
చనవిచ్చి కాఁగిలించి సారెసారెఁ గూడేవు
పనులెల్ల చక్కనైన పంతమా యిది
యెనలేక శ్రీవేంకటేశ నన్నేలితివి
వెనకముందెల్ల నీతో విన్నవించకుందునా
(||pallavi||)
ela nādone nīgu yiṁtavalĕnā
tālimido nā sem̐talu dakkiṁchugolenā
(||ela||)
rāgabogalane nannu rām̐pusesi nīviṁta
paigŏni navvu navvevu paṁtamā yidi
jogala nī saridalu sūdamani vuṁṭim̐gāga
sīgāgubarasi ninnum̐ jikkiṁchalenā
(||ela||)
ichchagamāḍinamāḍa yĕgasakkĕmugam̐ jesi
pachchi seseviṁdarilom̐ baṁtamā yidi
vachchīrāga tŏlle nīdo vādŏllaguṁdānam̐ gāga
rachchagĕkkiṁchi ninniṭṭĕ ravva seyanobanā
(||ela||)
sanavichchi kām̐giliṁchi sārĕsārĕm̐ gūḍevu
panulĕlla sakkanaina paṁtamā yidi
yĕnalega śhrīveṁkaḍeśha nannelidivi
vĕnagamuṁdĕlla nīdo vinnaviṁchaguṁdunā