Ela naadom borevu yimta neegum jalamela

ఏల నాతోఁ బోరేవు యింత నీకుఁ జలమేల
Language

(॥పల్లవి॥)
ఏల నాతోఁ బోరేవు యింత నీకుఁ జలమేల
నీ లాగులెల్లఁ జూచి నేనే పిలువనా

(॥ఏల॥)
పంతానకే నీవు నన్నుఁ బగ చాటి పిలిచేవు
యెంత లేదు నే నీకునెదురా వోరీ
యింతి నేనొకతెనింతె ఇంటిమూలనుండరాదా
కాంతుఁడ రతికి నేనే కడమైతినా

(॥ఏల॥)
మాటలాడనై తినంటా మచ్చరాలకే వచ్చేవు
ఆఁటదాని నాడించేదరుదా నీకు
నీటున నీయాధీనమై నీవద్దనుంటేఁ జాలదా
మేటివి నేఁ గూడకున్న మెచ్చరా నిన్నును

(॥ఏల॥)
యెగసక్కేలకే నన్నునిట్టె కాఁగిలించేవు
మగువలపై మరులు మానవా నేఁడు
తగిలి శ్రీవేంకటేశ తరి నన్నుఁ గూడితివి
నగవెల్ల నామీఁదనే నారుగాఁ బోసేవా

(||pallavi||)
ela nādom̐ borevu yiṁta nīgum̐ jalamela
nī lāgulĕllam̐ jūsi nene piluvanā

(||ela||)
paṁtānage nīvu nannum̐ baga sāḍi pilisevu
yĕṁta ledu ne nīgunĕdurā vorī
yiṁti nenŏgadĕniṁtĕ iṁṭimūlanuṁḍarādā
kāṁtum̐ḍa radigi nene kaḍamaidinā

(||ela||)
māḍalāḍanai tinaṁṭā machcharālage vachchevu
ām̐ṭadāni nāḍiṁchedarudā nīgu
nīḍuna nīyādhīnamai nīvaddanuṁṭem̐ jāladā
meḍivi nem̐ gūḍagunna mĕchcharā ninnunu

(||ela||)
yĕgasakkelage nannuniṭṭĕ kām̐giliṁchevu
maguvalabai marulu mānavā nem̐ḍu
tagili śhrīveṁkaḍeśha tari nannum̐ gūḍidivi
nagavĕlla nāmīm̐dane nārugām̐ bosevā