ఏల నాతో నాన వెట్టే వెవ్వ రేమనిరి నిన్ను
(॥పల్లవి॥)
ఏల నాతో నాన వెట్టే వెవ్వ రేమనిరి నిన్ను
నీతో నే నొకతెనై నిండుకుండనైతినా
(॥ఏల॥)
యింతితో నవ్వితి వేమి యీడ నూరకుంటి వేమి
యింత నీతో వాదడువ నేల నాకు
చెంతల నాఁడే నీకు సేస వెట్టి నీలోని-
కాంతలలో నొకతెనై కాఁపురము సేయనో
(॥ఏల॥)
యిందాఁకా నెందుంటి వేమి ఇందు నిద్దురించితేమి
ఇందుకుఁగాఁ గోపగించ నేల నాకు
చెంది నీకొలువు సేసేచెలియనై నీవద్ద
సందడించు కొంటా నుండి సరసము లాడనా
(॥ఏల॥)
ఆపనే మెచ్చితి వేమి అట్టె వొరగితి వేమి
యీపొద్దు నిన్ను సాదించ నేల నాకు
కాపాడి శ్రీవేంకటేశ కలసితి విదె నన్ను
చేపట్టి యిన్నిటికిఁగా చేత మొక్కనైతినా
(||pallavi||)
ela nādo nāna vĕṭṭe vĕvva remaniri ninnu
nīdo ne nŏgadĕnai niṁḍuguṁḍanaidinā
(||ela||)
yiṁtido navvidi vemi yīḍa nūraguṁṭi vemi
yiṁta nīdo vādaḍuva nela nāgu
sĕṁtala nām̐ḍe nīgu sesa vĕṭṭi nīloni-
kāṁtalalo nŏgadĕnai kām̐puramu seyano
(||ela||)
yiṁdām̐kā nĕṁduṁṭi vemi iṁdu nidduriṁchidemi
iṁdugum̐gām̐ gobagiṁcha nela nāgu
sĕṁdi nīgŏluvu sesesĕliyanai nīvadda
saṁdaḍiṁchu kŏṁṭā nuṁḍi sarasamu lāḍanā
(||ela||)
ābane mĕchchidi vemi aṭṭĕ vŏragidi vemi
yībŏddu ninnu sādiṁcha nela nāgu
kābāḍi śhrīveṁkaḍeśha kalasidi vidĕ nannu
sebaṭṭi yinniḍigim̐gā seda mŏkkanaidinā