ఏల నాపై నాన వెట్టే వేఁటికి నీకు వెరపు
(॥పల్లవి॥)
ఏల నాపై నాన వెట్టే వేఁటికి నీకు వెరపు
నీ లాగు రమణుఁడ నే నెఱఁగవా
(॥ఏల॥)
తేరకొన నీగుణాలు దెలిసినప్పుడు గాక
వీరి వారి మాటలకె వేగిరించేనా
మేరతో నీవు నాయెడ మెచ్చుగా నడవఁ గానె
కూరిమి గొసరి నిన్నుఁ గోపగించేనా
(॥ఏల॥)
యెల్లవారు నీచేఁతలు యెఱుఁగుదు మన్నదాఁకా
అల్లంత నిన్నుఁ గంటానె అలిగేనా
కల్ల నిజ మెఱఁగక కాదు గూడ దని నీపై
వెల్లవిరిగా నిందలు వేయఁ బొయ్యేనా
(॥ఏల॥)
మంతానాన నీ మేన మచ్చము గానకతొల్లె
పంత మాడి నే నీతో పగ చాటేనా
యింతలోఁ గాఁగిలించితి విందుకె శ్రీవెంకటేశ
యెం తయిన నిన్ను నే నెడసి వుండేనా
(||pallavi||)
ela nābai nāna vĕṭṭe vem̐ṭigi nīgu vĕrabu
nī lāgu ramaṇum̐ḍa ne nĕṟam̐gavā
(||ela||)
teragŏna nīguṇālu dĕlisinappuḍu gāga
vīri vāri māḍalagĕ vegiriṁchenā
merado nīvu nāyĕḍa mĕchchugā naḍavam̐ gānĕ
kūrimi gŏsari ninnum̐ gobagiṁchenā
(||ela||)
yĕllavāru nīsem̐talu yĕṟum̐gudu mannadām̐kā
allaṁta ninnum̐ gaṁṭānĕ aligenā
kalla nija mĕṟam̐gaga kādu gūḍa dani nībai
vĕllavirigā niṁdalu veyam̐ bŏyyenā
(||ela||)
maṁtānāna nī mena machchamu gānagadŏllĕ
paṁta māḍi ne nīdo paga sāḍenā
yiṁtalom̐ gām̐giliṁchidi viṁdugĕ śhrīvĕṁkaḍeśha
yĕṁ tayina ninnu ne nĕḍasi vuṁḍenā