ఏల న న్నొడఁబరచీ యెంత వడియైనాను
(॥పల్లవి॥)
ఏల న న్నొడఁబరచీ యెంత వడియైనాను
వాలాఇంచి కూడేనంటే వద్దనేనా నేను
(॥ఏల॥)
గక్కనఁ దనతో తారుకాణలకు నోపఁగాని
తక్కక తానన్నమాఁట తానే యెరుఁగు
పక్కనఁ దనచేఁతలు పట్టియ్యనోపఁగాని
మిక్కుటపు గురుతులు మోనిపైనే వున్నవి
(॥ఏల॥)
తలకొని నే నంతేసి తప్పువేయ నొపఁగాని
తలఁచితే తనసుద్ది తానే యెరుఁగు
సొలసి తను నంతేసి సోదించనోపఁగాని
కలదెల్లా ముంజేతి కంకణాన నున్నది
(॥ఏల॥)
సరుగఁ దన గుణాలు చక్కదిద్దనోపఁగాని
తరవాతి పనులెల్లా తానే యెరుఁగు
ఇరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
సిరులఁ దనవలపు శిరసుపై నున్నది
(||pallavi||)
ela na nnŏḍam̐barasī yĕṁta vaḍiyainānu
vālāiṁchi kūḍenaṁṭe vaddanenā nenu
(||ela||)
gakkanam̐ danado tārugāṇalagu nobam̐gāni
takkaga tānannamām̐ṭa tāne yĕrum̐gu
pakkanam̐ danasem̐talu paṭṭiyyanobam̐gāni
mikkuḍabu gurudulu monibaine vunnavi
(||ela||)
talagŏni ne naṁtesi tappuveya nŏbam̐gāni
talam̐side tanasuddi tāne yĕrum̐gu
sŏlasi tanu naṁtesi sodiṁchanobam̐gāni
kaladĕllā muṁjedi kaṁkaṇāna nunnadi
(||ela||)
sarugam̐ dana guṇālu sakkadiddanobam̐gāni
taravādi panulĕllā tāne yĕrum̐gu
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
sirulam̐ danavalabu śhirasubai nunnadi