ఏల మూసి దాఁచేవు యిదేమయ్యా
(॥పల్లవి॥)
ఏల మూసి దాఁచేవు యిదేమయ్యా
ఆలుగాదా నీకు నాపె అదేమయ్యా
(॥॥)
బత్తితోడ నిన్నుఁ జూచి పడఁతి మాటలాడఁగా
యిత్తల సిగ్గువడేవు యిదేమయ్యా
బొత్తుగాఁ బువ్వులచెండు పూఁచి కానుకియ్యఁగాను
హత్తిచేతి నందుకొన వదేమయ్యా
(॥॥)
ముందరనే నిలుచుండి మోహ మాపె చల్లఁగాను
ఇందుకు రమ్మనరాదా ఇదేమయ్యా
విందువలెఁ జెవిలోన విన్నపాలు సేయఁగాను
అందుకు నేమీనన వదేమయ్యా
(॥॥)
నెఱతనమున వచ్చి నీపాదము దొక్కఁగాని
యెఱఁగనట్టే వున్నాఁడ విదేమయ్యా
మఱి నన్నుఁ గూడితివి మరిగి శ్రీవేంకటేశ
అఱమఱచే వాపెను అదేమయ్యా
(||pallavi||)
ela mūsi dām̐sevu yidemayyā
ālugādā nīgu nābĕ ademayyā
(||||)
battidoḍa ninnum̐ jūsi paḍam̐ti māḍalāḍam̐gā
yittala sigguvaḍevu yidemayyā
bŏttugām̐ buvvulasĕṁḍu pūm̐si kānugiyyam̐gānu
hattisedi naṁdugŏna vademayyā
(||||)
muṁdarane nilusuṁḍi moha mābĕ sallam̐gānu
iṁdugu rammanarādā idemayyā
viṁduvalĕm̐ jĕvilona vinnabālu seyam̐gānu
aṁdugu nemīnana vademayyā
(||||)
nĕṟadanamuna vachchi nībādamu dŏkkam̐gāni
yĕṟam̐ganaṭṭe vunnām̐ḍa videmayyā
maṟi nannum̐ gūḍidivi marigi śhrīveṁkaḍeśha
aṟamaṟase vābĕnu ademayyā