ఏల మేకులు సేసేవు ఇందరిఁ జూపి మమ్ము
(॥పల్లవి॥)
ఏల మేకులు సేసేవు ఇందరిఁ జూపి మమ్ము
పాలు వాలే నీరు నీరే పలుక లేమిటికి
(॥ఏల॥)
కాయకపువావులకాంతలు సరయ్యేరా
చేయిమీఁదై సేసపాల చెలులకును
మాయదారిబీటియెఁడమావులనేళ్లెల్లాను
కాయపుదప్పి దేరుచఁ కాఁగులు నిండీనా
(॥ఏల॥)
యెరవులసతులెల్ల యీడుజోడు వచ్చేరా
తిరమైనపట్టంపుదేవులకును
అరమరచి చూచిన ఆమనిపచ్చలెల్లాను
వరుస రాసులై కొలవఁగ వచ్చీనా
(॥ఏల॥)
కన్నవూడిగపువారు కలసేరా కొలమున
నిన్నుఁ గూడిమావంటినెలఁతలతో
యిన్నిటా శ్రీవేంకటేశ యెంచి చూచుకొంటేను
వెన్నెలకువ్వలెల్లా వెలకెక్కీనా
(||pallavi||)
ela megulu sesevu iṁdarim̐ jūbi mammu
pālu vāle nīru nīre paluga lemiḍigi
(||ela||)
kāyagabuvāvulagāṁtalu sarayyerā
seyimīm̐dai sesabāla sĕlulagunu
māyadāribīḍiyĕm̐ḍamāvulaneḽlĕllānu
kāyabudappi derusam̐ kām̐gulu niṁḍīnā
(||ela||)
yĕravulasadulĕlla yīḍujoḍu vachcherā
tiramainabaṭṭaṁpudevulagunu
aramarasi sūsina āmanibachchalĕllānu
varusa rāsulai kŏlavam̐ga vachchīnā
(||ela||)
kannavūḍigabuvāru kalaserā kŏlamuna
ninnum̐ gūḍimāvaṁṭinĕlam̐talado
yinniḍā śhrīveṁkaḍeśha yĕṁchi sūsugŏṁṭenu
vĕnnĕlaguvvalĕllā vĕlagĕkkīnā