Ela maṟamgunanumde vidu raaraadaa

ఏల మఱఁగుననుండే విటు రారాదా
Language

(॥పల్లవి॥)
ఏల మఱఁగుననుండే విటు రారాదా
మేలిమి విభుఁడవని మెత్తు నిన్నును

(॥ఏల॥)
జిగి నీమోవిమీఁదటి చిల్లరచేఁతలు చూచి
నగుదుఁగాని నిన్నెన్నఁడు దూరను
నిగిడిన నీమేనినిండుఁజెమటలు చూచి
తగునందుఁగాని మరి తమకించను

(॥ఏల॥)
చెక్కులపై నిండుకొన్న చిన్నిపులకలు చూచి
మొక్కుదుఁగాని కోపమునఁ దిట్టను
అక్కడనుండి వచ్చిన అసురుసురులు చూచి
చొక్కుదుఁగాని నిన్ను సొలశాడను

(॥ఏల॥)
గుట్టుతో నాకెఁగూడిన గురుతులన్నియుఁ జూచి
యిట్టే పొగడుదుఁగాని యేమీ ననను
ఱట్టై శ్రీవేంకటేశ మీఱఁగ నన్ను నేలితివి
పట్టి పాలారుతుఁగాని పచ్చిసేయను

(||pallavi||)
ela maṟam̐gunanuṁḍe viḍu rārādā
melimi vibhum̐ḍavani mĕttu ninnunu

(||ela||)
jigi nīmovimīm̐daḍi sillarasem̐talu sūsi
nagudum̐gāni ninnĕnnam̐ḍu dūranu
nigiḍina nīmeniniṁḍum̐jĕmaḍalu sūsi
tagunaṁdum̐gāni mari tamagiṁchanu

(||ela||)
sĕkkulabai niṁḍugŏnna sinnibulagalu sūsi
mŏkkudum̐gāni kobamunam̐ diṭṭanu
akkaḍanuṁḍi vachchina asurusurulu sūsi
sŏkkudum̐gāni ninnu sŏlaśhāḍanu

(||ela||)
guṭṭudo nāgĕm̐gūḍina gurudulanniyum̐ jūsi
yiṭṭe pŏgaḍudum̐gāni yemī nananu
ṟaṭṭai śhrīveṁkaḍeśha mīṟam̐ga nannu nelidivi
paṭṭi pālārudum̐gāni pachchiseyanu