ఏల మమ్ముఁ జెనకేవు యెడ్డవా నీవు
(॥పల్లవి॥)
ఏల మమ్ముఁ జెనకేవు యెడ్డవా నీవు
వేలఁ జూపేరు నిన్నునె వినుకొన రాదా
(॥ఏల॥)
యేరా మా కస్తూరిబొట్టు యె ట్టుండె నేమి నీకు
గోర దిద్ద వచ్చేవు కూళవా నీవు
గారవపు నీ మేనఁ గస్తూరి రేక లవిగో
తేరకొన వంక లెల్ల దొద్దుకొన రాదా
(॥ఏల॥)
చెల్లఁబో నా హారములు చిక్కువడితే నేమి
మల్లాడి దిద్ద వచ్చేవు మంకవా నీవు
చిల్లా పొల్లాయ నీ మెయిఁ జెమటముత్తెము లెల్ల
పెల్లు రేగి నీవె చక్కఁ బెట్టుకొన రాదా
(॥ఏల॥)
చనుఁగొంగు జారె నంటాఁ జక్క దొబ్బ వచ్చేవు
చనవున నన్నిటాను జాణవా నీవు
చెనకి కాఁగిలించితి శ్రీవెంకటేశ నీవు
ననిచి నీ పచ్చడము నాకు గప్ప రాదా
(||pallavi||)
ela mammum̐ jĕnagevu yĕḍḍavā nīvu
velam̐ jūberu ninnunĕ vinugŏna rādā
(||ela||)
yerā mā kastūribŏṭṭu yĕ ṭṭuṁḍĕ nemi nīgu
gora didda vachchevu kūḽavā nīvu
gāravabu nī menam̐ gastūri rega lavigo
teragŏna vaṁka lĕlla dŏddugŏna rādā
(||ela||)
sĕllam̐bo nā hāramulu sikkuvaḍide nemi
mallāḍi didda vachchevu maṁkavā nīvu
sillā pŏllāya nī mĕyim̐ jĕmaḍamuttĕmu lĕlla
pĕllu regi nīvĕ sakkam̐ bĕṭṭugŏna rādā
(||ela||)
sanum̐gŏṁgu jārĕ naṁṭām̐ jakka dŏbba vachchevu
sanavuna nanniḍānu jāṇavā nīvu
sĕnagi kām̐giliṁchidi śhrīvĕṁkaḍeśha nīvu
nanisi nī pachchaḍamu nāgu gappa rādā