ఏల మమ్ముఁ గొసరేవు యెంతగద్దు నీయాస
(॥పల్లవి॥)
ఏల మమ్ముఁ గొసరేవు యెంతగద్దు నీయాస
వోలిఁ జెలులు నీ రతి కోర్వఁగ వశమా
(॥ఏల॥)
పెదవిపై తేనెలు పేరుకొనవచ్చుగాక
పొదిగి తెచ్చి కుండలఁ బోయవశమా
కుదురు గుబ్బలమీఁద కుప్పసేయవచ్చు గాక
చిదిమి తెచ్చి వయసు చేతఁ బెట్టవశమా
(॥ఏల॥)
సిరిమించే నవ్వులు సెలవుల నుండుఁ గాక
వరుసఁ జిత్తరువున వా(వ్రా)యవశమా
సరసపుఁ జూపు నీపైఁ జల్లఁగవచ్చుఁగాక
జరసేటి వేళ గంటే సరి జూప వశమా
(॥ఏల॥)
కరఁగిన మోహములు కాఁగిటఁజూపుటఁగాక
బెరఇంచి వోర్పునఁ బెట్టవశమా
గరిమ శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
తెరలోననే కాక తెలుపఁగ వశమా
(||pallavi||)
ela mammum̐ gŏsarevu yĕṁtagaddu nīyāsa
volim̐ jĕlulu nī radi korvam̐ga vaśhamā
(||ela||)
pĕdavibai tenĕlu perugŏnavachchugāga
pŏdigi tĕchchi kuṁḍalam̐ boyavaśhamā
kuduru gubbalamīm̐da kuppaseyavachchu gāga
sidimi tĕchchi vayasu sedam̐ bĕṭṭavaśhamā
(||ela||)
sirimiṁche navvulu sĕlavula nuṁḍum̐ gāga
varusam̐ jittaruvuna vā(vrā)yavaśhamā
sarasabum̐ jūbu nībaim̐ jallam̐gavachchum̐gāga
jaraseḍi veḽa gaṁṭe sari jūba vaśhamā
(||ela||)
karam̐gina mohamulu kām̐giḍam̐jūbuḍam̐gāga
bĕra̮iṁchi vorbunam̐ bĕṭṭavaśhamā
garima śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
tĕralonane kāga tĕlubam̐ga vaśhamā