Ela mammum baraseene yevvamde taanu

ఏల మమ్ముఁ బరచీనే యెవ్వఁడే తాను
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ముఁ బరచీనే యెవ్వఁడే తాను
నాలిచేఁత చేసుకొంటా నవ్వు నవ్వీ మమ్మును

(॥ఏల॥)
చన్నుల నొరసుకొంటాఁ సంగడి నిలుచుకొంటా
సన్నలు సేసి పిలిచీ సారెకుఁ దాను
కిన్నెర మీటుకొంటాఁ గేలు మీఁదఁ జాఁచుకొంటా
వున్నవారి నెరఁగఁడు వుడికించీఁ దాను

(॥ఏల॥)
అంగములు ముట్టుకొంటా నడ్డాలు నడచుకొంటా
వుంగిటి నానలు వెట్టీ నూరకే తాను
తొంగలించి చూచుకొంటా దూరుచు గొణఁగుకొంటా
చెంగట సిగ్గు విడచి చిమ్మిరేఁచీ మమ్మును

(॥ఏల॥)
చనవులు సేసికొంటా సరసము లాడుకొంటా-
నెనసి కాఁగిట నించీ నిప్పుడేతాను
వెనుకొని కలసె శ్రీవేంకటేశుఁ డిదె నన్ను
తనివోని కూటముల తతిగోనీ మమ్మును

(||pallavi||)
ela mammum̐ barasīne yĕvvam̐ḍe tānu
nālisem̐ta sesugŏṁṭā navvu navvī mammunu

(||ela||)
sannula nŏrasugŏṁṭām̐ saṁgaḍi nilusugŏṁṭā
sannalu sesi pilisī sārĕgum̐ dānu
kinnĕra mīḍugŏṁṭām̐ gelu mīm̐dam̐ jām̐sugŏṁṭā
vunnavāri nĕram̐gam̐ḍu vuḍigiṁchīm̐ dānu

(||ela||)
aṁgamulu muṭṭugŏṁṭā naḍḍālu naḍasugŏṁṭā
vuṁgiḍi nānalu vĕṭṭī nūrage tānu
tŏṁgaliṁchi sūsugŏṁṭā dūrusu gŏṇam̐gugŏṁṭā
sĕṁgaḍa siggu viḍasi simmirem̐sī mammunu

(||ela||)
sanavulu sesigŏṁṭā sarasamu lāḍugŏṁṭā-
nĕnasi kām̐giḍa niṁchī nippuḍedānu
vĕnugŏni kalasĕ śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannu
tanivoni kūḍamula tadigonī mammunu