ఏల మమ్ము రేఁచేవు యింత ఱట్టు మా కేఁటికి
(॥పల్లవి॥)
ఏల మమ్ము రేఁచేవు యింత ఱట్టు మా కేఁటికి
మేలు మీఁదనుండరాదా మెప్పించేఁ గాని
(॥ఏల॥)
మాయదారిమాటలేల మరఁగుననున్న యాపె
చాయల నీ మోహపు సతిగాదా
తీయరాదా నీచేతనె తెరమరఁ గించుకంతా
చేయిచాఁచి నీ కన్నియుఁ జెప్పి చూపేఁగాని
(॥ఏల॥)
యీడుగాని యానలేల యింటిలోన నున్న యాపె
జోడుగ నీ ప్రాణమైన సుదతిగాదా
యేడసుద్ది గడియ దీయించరాదా నేఁ జూచి
యీడనె పేరుఁ బెంపు నీ కెత్తియిచ్చేఁగాని
(॥ఏల॥)
సారెకు నవ్వులేల పచ్చడములోనున్న యాపె
కూరిమి నీ కొత్తపండ్లికూఁతురుగాదా
చేర నా కెదురువచ్చి శ్రీవెంకటేశ కూడితి
వూరకుండరాదా నీకు వొప్పగించేఁగాని
(||pallavi||)
ela mammu rem̐sevu yiṁta ṟaṭṭu mā kem̐ṭigi
melu mīm̐danuṁḍarādā mĕppiṁchem̐ gāni
(||ela||)
māyadārimāḍalela maram̐gunanunna yābĕ
sāyala nī mohabu sadigādā
tīyarādā nīsedanĕ tĕramaram̐ giṁchugaṁtā
seyisām̐si nī kanniyum̐ jĕppi sūbem̐gāni
(||ela||)
yīḍugāni yānalela yiṁṭilona nunna yābĕ
joḍuga nī prāṇamaina sudadigādā
yeḍasuddi gaḍiya dīyiṁcharādā nem̐ jūsi
yīḍanĕ perum̐ bĕṁpu nī kĕttiyichchem̐gāni
(||ela||)
sārĕgu navvulela pachchaḍamulonunna yābĕ
kūrimi nī kŏttabaṁḍligūm̐turugādā
sera nā kĕduruvachchi śhrīvĕṁkaḍeśha kūḍidi
vūraguṁḍarādā nīgu vŏppagiṁchem̐gāni