ఏల మమ్ము రట్టు సేసేవింతటిలోనే పెను
(॥పల్లవి॥)
ఏల మమ్ము రట్టు సేసేవింతటిలోనే పెను-
వేలనే గడె వెట్టితి వెళ్ళనియ్య నిన్నును
(॥ఏల॥)
వొద్దనఁగాఁ బొయ్యేవు వొంటిఁ జిక్కించుక యాపె
అద్దలించి యేమైనాననకుండీనా
అద్దో నాతో నీవు అలిగి యందు చేరిన
పొద్దుగాని పొద్దనక పొందులు సేసేరా
(॥ఏల॥)
తుమ్మఁగానే లేచేవు తొయ్యలి యెవ్వతెయైనా
దిమ్మురేఁచి వాదుదీసి తిట్టకుండీనా
యెమ్మెల నాతో మేకులకెవ్వతెఁ బలిపించినా
నమ్మరాదనక నీతో నవ్వవచ్చేరా
(॥ఏల॥)
మొక్కఁగా నడుగిడేవు ముందటనెవ్వతెయైనా
చిక్కించుక చేఁతలెల్లాఁ జేయకుండీనా
మక్కువ శ్రీ వేంకటేశ మగిడి నన్నుఁ గూడితివి
తక్కిన వారు నవ్వక తాము లోనయ్యేరా
(||pallavi||)
ela mammu raṭṭu seseviṁtaḍilone pĕnu-
velane gaḍĕ vĕṭṭidi vĕḽḽaniyya ninnunu
(||ela||)
vŏddanam̐gām̐ bŏyyevu vŏṁṭim̐ jikkiṁchuga yābĕ
addaliṁchi yemainānanaguṁḍīnā
addo nādo nīvu aligi yaṁdu serina
pŏddugāni pŏddanaga pŏṁdulu seserā
(||ela||)
tummam̐gāne lesevu tŏyyali yĕvvadĕyainā
dimmurem̐si vādudīsi tiṭṭaguṁḍīnā
yĕmmĕla nādo megulagĕvvadĕm̐ balibiṁchinā
nammarādanaga nīdo navvavachcherā
(||ela||)
mŏkkam̐gā naḍugiḍevu muṁdaḍanĕvvadĕyainā
sikkiṁchuga sem̐talĕllām̐ jeyaguṁḍīnā
makkuva śhrī veṁkaḍeśha magiḍi nannum̐ gūḍidivi
takkina vāru navvaga tāmu lonayyerā