Ela mammu rattu sese vemti kamtini

ఏల మమ్ము రట్టు సేసే వేఁటి కంటిని
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ము రట్టు సేసే వేఁటి కంటిని
ఆలరి వో రమణుఁడ అన్నియు నే వంటివి

(॥ఏల॥)
పలు నీ చేఁతల నెల్లఁ బచ్చిసేయ లేకే కా
చలిమి దవ్వుల పొంచే చాలు నంటిని
అలరి నీ మాటలకు వడ్డ మాడలేకే కా
వలవంతఁ బదివేలూ వచ్చె నంటిని

(॥ఏల॥)
నిన్నుఁ జూచి నీగుణాలు నేర మెంచలేకే కా
అన్నిటా జాణఁడవు నీ వౌదు వంటిని
మన్నన నీసతులతో మచ్చరించలేకే కా
వున్నతి నీ చెనకులు వొద్దంటిని

(॥ఏల॥)
మునుప నీ కూటముల మొకమోటములకే కా
యెనసి కన్నుల మొక్కు లియ్యకొంటిని
అనయము శ్రీవేంకటాధిప నీ మన్ననల
తనిసి యింతకు నీవే దైవమ వంటిని

(||pallavi||)
ela mammu raṭṭu sese vem̐ṭi kaṁṭini
ālari vo ramaṇum̐ḍa anniyu ne vaṁṭivi

(||ela||)
palu nī sem̐tala nĕllam̐ bachchiseya lege kā
salimi davvula pŏṁche sālu naṁṭini
alari nī māḍalagu vaḍḍa māḍalege kā
valavaṁtam̐ badivelū vachchĕ naṁṭini

(||ela||)
ninnum̐ jūsi nīguṇālu nera mĕṁchalege kā
anniḍā jāṇam̐ḍavu nī vaudu vaṁṭini
mannana nīsadulado machchariṁchalege kā
vunnadi nī sĕnagulu vŏddaṁṭini

(||ela||)
munuba nī kūḍamula mŏgamoḍamulage kā
yĕnasi kannula mŏkku liyyagŏṁṭini
anayamu śhrīveṁkaḍādhiba nī mannanala
tanisi yiṁtagu nīve daivama vaṁṭini