Ela mammu neggulemche vemamti ninnu

ఏల మమ్ము నెగ్గులెంచే వేమంటి నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ము నెగ్గులెంచే వేమంటి నిన్ను
తాలిముల కెల్ల గురి తన మనసే

(॥ఏల॥)
మోహము గలవారికి ముంగోపపుతి ట్లెల్ల
దేహనకు చల్ల నైనదీవెన లౌను
యీహల మనసు రాక యిత వెంత సేసినాను
వూహించి చూచినను వొరటు లై తోఁచుము

(॥ఏల॥)
అచ్చివచ్చినచోటికి ఆయాలు దాఁకించుకొన్న
మచ్చికఁ గళలు రేఁగేమర్మము లౌను
మచ్చర మైనచోట మరి పాదా లొత్తినాను
కచ్చు పెట్టి యవే కామాకారము లై తోఁచును

(॥ఏల॥)
అనుమాన మైనందుకు అన్నియానలు వెట్టిన
పనికి వచ్చునో రాదో భావించ రాదు
ఘనుఁడ శ్రీవెంకటేశ కైకొని కూడితి నిన్ను
వెనకటిదయ నాపై విడువకు వయ్యా

(||pallavi||)
ela mammu nĕggulĕṁche vemaṁṭi ninnu
tālimula kĕlla guri tana manase

(||ela||)
mohamu galavārigi muṁgobabudi ṭlĕlla
dehanagu salla nainadīvĕna launu
yīhala manasu rāga yida vĕṁta sesinānu
vūhiṁchi sūsinanu vŏraḍu lai tom̐sumu

(||ela||)
achchivachchinasoḍigi āyālu dām̐kiṁchugŏnna
machchigam̐ gaḽalu rem̐gemarmamu launu
machchara mainasoḍa mari pādā lŏttinānu
kachchu pĕṭṭi yave kāmāgāramu lai tom̐sunu

(||ela||)
anumāna mainaṁdugu anniyānalu vĕṭṭina
panigi vachchuno rādo bhāviṁcha rādu
ghanum̐ḍa śhrīvĕṁkaḍeśha kaigŏni kūḍidi ninnu
vĕnagaḍidaya nābai viḍuvagu vayyā