Ela mammu geli sese rimtulaala

ఏల మమ్ము గేలి సేసే రింతులాల
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ము గేలి సేసే రింతులాల
మేలుమీఁది దాననింత మెచ్చఁ గదరమ్మా

(॥ఏల॥)
చలము సాదించఁబోతే జవ్వన మాఁపఁగరాదు
పలుకకుండేనంటే ఫలము లేదు
చెలువుఁడెదుట వచ్చి చెయి వట్టుకున్నవాఁడు
తొలఁగఁదోయఁగరాక తూర నవ్వేనమ్మా

(॥ఏల॥)
కోపగించుకొనఁబోతే కొసరఁగఁ జోటులేదు
చూపుల జంకించేనంటే సొగయదది
యేపున నితఁడు వీరెమిందమనుచున్నవాఁడు
పై పై నొదుగలేక భావించేనమ్మా

(॥ఏల॥)
పంతములాడేనంటే పతితో బలము లేదు
వింత సేసుకుండేనంటే వేడుక లేదు
యింతలో శ్రీ వేంకటేశుఁడెమ్మెచూపినన్నుఁగూడె
చింతదీర వెరగుతోడి సిగ్గుపడేనమ్మా

(||pallavi||)
ela mammu geli sese riṁtulāla
melumīm̐di dānaniṁta mĕchcham̐ gadarammā

(||ela||)
salamu sādiṁcham̐bode javvana mām̐pam̐garādu
palugaguṁḍenaṁṭe phalamu ledu
sĕluvum̐ḍĕduḍa vachchi sĕyi vaṭṭugunnavām̐ḍu
tŏlam̐gam̐doyam̐garāga tūra navvenammā

(||ela||)
kobagiṁchugŏnam̐bode kŏsaram̐gam̐ joḍuledu
sūbula jaṁkiṁchenaṁṭe sŏgayadadi
yebuna nidam̐ḍu vīrĕmiṁdamanusunnavām̐ḍu
pai pai nŏdugalega bhāviṁchenammā

(||ela||)
paṁtamulāḍenaṁṭe padido balamu ledu
viṁta sesuguṁḍenaṁṭe veḍuga ledu
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ḍĕmmĕsūbinannum̐gūḍĕ
siṁtadīra vĕragudoḍi siggubaḍenammā