Ela mammu garisimche vemdaamkaanu

ఏల మమ్ము గరిసించే వెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ము గరిసించే వెందాఁకాను
జాలువారే చెమటల జడివానే సాక్షి

(॥ఏల॥)
అండనున్న సతులను అడుగనేమిటికి
నిండిన నీ చేఁతలకు నీవే సాక్షి
చండిసేసి నిన్ను నేము సారెఁ జొప్పులెత్తేమా
మెండుకొని వుండిన నీమేని గోరే సాక్షి

(॥ఏల॥)
ఆసలు వెట్టుక యింత అలయఁగనేమిటికి
పూనిన నీ పొందులకు వురమే సాక్షి
మానాపతులము నీ మర్మములెత్తేమా
తానకపు నిట్టూర్పుల తఱచులే సాక్షి

(॥ఏల॥)
పంతమున మమ్ము నొడఁబరచఁగ నేమిటికి
వింత సుద్దులకు నీవేడుకే సాక్షి
యింత శ్రీవెంకటేశ మమ్మేలితి వేతులెత్తేమా
కాంతి నామోమునఁ దేరే కళలే సాక్షి

(||pallavi||)
ela mammu garisiṁche vĕṁdām̐kānu
jāluvāre sĕmaḍala jaḍivāne sākṣhi

(||ela||)
aṁḍanunna sadulanu aḍuganemiḍigi
niṁḍina nī sem̐talagu nīve sākṣhi
saṁḍisesi ninnu nemu sārĕm̐ jŏppulĕttemā
mĕṁḍugŏni vuṁḍina nīmeni gore sākṣhi

(||ela||)
āsalu vĕṭṭuga yiṁta alayam̐ganemiḍigi
pūnina nī pŏṁdulagu vurame sākṣhi
mānābadulamu nī marmamulĕttemā
tānagabu niṭṭūrbula taṟasule sākṣhi

(||ela||)
paṁtamuna mammu nŏḍam̐barasam̐ga nemiḍigi
viṁta suddulagu nīveḍuge sākṣhi
yiṁta śhrīvĕṁkaḍeśha mammelidi vedulĕttemā
kāṁti nāmomunam̐ dere kaḽale sākṣhi